Veera Simha Reddy: వీరసింహారెడ్డిలో ఆ ఒక్కటే బ్యాలెన్స్..!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’పై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద బాలయ్య మరోసారి రెచ్చిపోవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Veera Simha Reddy: వీరసింహారెడ్డిలో ఆ ఒక్కటే బ్యాలెన్స్..!

One Song Balance In Veera Simha Reddy

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’పై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద బాలయ్య మరోసారి రెచ్చిపోవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Veera Simha Reddy: వీరసింహారెడ్డిలో బాలయ్య ఊచకోత మామూలుగా ఉండదట!

అయితే ఈ సినిమాను సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అఫీషియల్‌గా వెల్లడించగా, ఈ సినిమా షూటింగ్ పరిస్థితి ఏమిటా అని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా షూటింగ్ జరుపుకుంటుండటంతో ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందా అని వారు ఆందోళన చెందుతున్నారు. అయితే చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయ్యిందని.. కేవలం ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని వారు పేర్కొన్నారు.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి ఆగమనం ఆ రోజే..!

దీంతో ఈ సాంగ్‌ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి, వీరసింహారెడ్డి చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి.. సినిమా ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన లుక్స్‌లో కనిపిస్తుండగా, ఆయన సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం మరోసారి అదిరిపోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సాంగ్ నిరూపించింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.