Mahesh – Prabhas : ట్విట్టర్‌లో ‘#orey’ గొడవ ఏంటి.. ఆ గొడవతో మహేష్-ప్రభాస్‌కి సంబంధం ఏంటి?

ట్విట్టర్ లో ఎప్పుడు ఏదోకటి ట్రెండ్ అవుతూ ఉంటుంది. తాజాగా '#orey' హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతుంది. అసలు ఈ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుందో తెలియక చాలా మంది తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే..

Mahesh – Prabhas : ట్విట్టర్‌లో ‘#orey’ గొడవ ఏంటి.. ఆ గొడవతో మహేష్-ప్రభాస్‌కి సంబంధం ఏంటి?

mahesh prabhas

Mahesh – Prabhas : ట్విట్టర్ లో ఎప్పుడు ఏదోకటి ట్రెండ్ అవుతూ ఉంటుంది. తాజాగా ‘#orey’ హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతుంది. అసలు ఈ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుందో తెలియక చాలా మంది తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఈ హ్యాష్ ట్యాగ్ ప్రభాస్, మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య మొదలైన గొడవ వల్ల మొదలైంది. నిన్న ప్రభాస్ అండ్ మహేష్ అభిమానులు తమ ప్రత్యర్థి అభిమాన హీరో కుటుంబాల గురించి అసహ్యకరమైన పోస్ట్‌లు షేర్ చేసి ఫ్యాన్ వార్ మొదలుపెట్టారు. ట్విట్టర్ లో మొదలైన ఈ గొడవ ఒకర్ని ఒకరు సవాలు చేసుకునేదాకా వెళ్ళింది.

Tollywood Heros : షూటింగ్‌లతో బిజీగా మారిన స్టార్ హీరోలు.. ఎవరెవరు ఎక్కడ షూటింగ్ చేస్తున్నారో తెలుసా?

ఈ నేపథ్యంలోనే బెంగుళూరుకి చెందిన ఒక ప్రభాస్ అభిమాని తాను ఉంటున్న లొకేషన్‌ని షేర్ చేసి.. తనతో పేస్ టు పేస్ రావాలి అంటూ మహేష్ అభిమానికి సవాలు విసిరాడు. అయితే ఆ లొకేషన్ కి మహేష్ అభిమాని రాకపోవడంతో గాజుల ఫోటో పెట్టి అవి వేసుకోండి మీ అభిమానులు అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన ఒక హైదరాబాద్ మహేష్ అభిమాని తన లొకేషన్‌ని షేర్ చేసి సవాలు విసిరాడు. ప్రభాస్ ఫ్యాన్ కూడా ఈ సవాలని స్వీకరించకపోవడంతో మహేష్ బాబు ఫ్యాన్ చీర ఫోటో పెట్టి అది కట్టుకోండి మీ అభిమానులంతా అంటూ ట్వీట్ లు చేశారు. అయితే ఈ ట్వీట్ లు సమయంలో ‘#orey ఎక్కడరా’ అంటూ సంబోదించుకోవడంతో, అది కాస్త ట్రెండ్ అవుతుంది.

ఇక్కడ ఆనందించాల్సిన విషయం ఏంటంటే ఈ ఫ్యాన్ వార్ ట్విట్టర్ వరుకే మిగిలిపోయింది. అయితే ఈ ఫ్యాన్ వార్ గురించి తెలియని కొందరు సోషల్ మీడియాలో మీమ్స్ వేస్తూ హాస్యాస్పదంగా మార్చేశారు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు SSMB28 షూటింగ్ సారధి స్టూడియోలో జరుగుతుంది. ప్రభాస్ సలార్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ కానున్నాయి.