Ori Devuda: ఓరి దేవుడా.. సర్‌ప్రైజ్ మాత్రం మామూలుగా లేదుగా!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన రీసెంట్ మూవీ ‘ఓరి దేవుడా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా వెల్లడించింది.

Ori Devuda: ఓరి దేవుడా.. సర్‌ప్రైజ్ మాత్రం మామూలుగా లేదుగా!

Ori Devuda To Stream In OTT From Tonight

Ori Devuda: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన రీసెంట్ మూవీ ‘ఓరి దేవుడా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అయితే ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ మూవీకి రీమేక్‌గా తెరకెక్కించడం, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో విక్టరీ వెంకటేష్ నటించడం లాంటి ప్రత్యేకతలు ఉన్నా, ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Ori Devuda Heroines: “నాటు నాటు” స్టెప్ వేసి అదరగొట్టిన విశ్వక్ సేన్ హీరోయిన్లు..

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా వెల్లడించింది. ‘ఓరి దేవుడా’ సినిమాను ఇవాళ అర్ధరాత్రి నుండి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు వారు ప్రకటించారు. దీంతో ప్రేక్షకులు అవాక్కవుతున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమాను ఇంత త్వరగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం, అది కూడా సడెన్‌గా ఇలా సర్‌ప్రైజ్ చేయడం ఏమిటని అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.

Ori Devuda: ఓరి దెవుడా… అప్పుడే ఓటీటీ లాక్..?

ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్‌తో పాటు మిథిలా పాల్కర్, ఆశా భట్ ముఖ్య పాత్రల్లో నటించగా, అశ్వత్ మరిముత్తు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.