Telugu Heroines : తెలుగులో టాప్‌లో సమంత.. ఆ తర్వాతే ఎవరైనా..

ఆర్మాక్స్ మీడియా నిర్వహించిన సర్వే ప్రకారం తెలుగు టాప్ 10 ఫిమేల్ స్టార్స్ లో సమంత మొదటి స్థానం దక్కించుకుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత పెళ్లి తర్వాత ఎక్కువ.........

Telugu Heroines : తెలుగులో టాప్‌లో సమంత.. ఆ తర్వాతే ఎవరైనా..

Telugu Heroines

Telugu Heroines :  గత కొంత కాలంగా కొన్ని సంస్థలు సెలబ్రిటీలపై సర్వేలు నిర్వహించి ప్రజల్లో ఎక్కువ ఎవరికీ ఫాలోయింగ్ ఉంది, ఎక్కువ ఎవర్ని ఫాలో అవుతున్నారు, ఎవర్ని ఇష్టపడుతున్నారు అని సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇలా సర్వేలు నిర్వహించే సంస్థల్లో ఒకటైన మోస్ట్ పాపులర్ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా ప్రతి సంవత్సరం మోస్ట్ పాపులర్ స్టార్స్ అంటూ అన్ని భాషల్లోనూ సర్వే నిర్వహిస్తుంది. తాజాగా 2021 సంబంధించి నిర్వహించిన సర్వేలో అన్ని భాషల్లోనూ సినిమాల పరంగా, సీరియల్స్ పరంగా సర్వే నిర్వహించి టాప్ 10 స్టార్లను వెల్లడించారు.

ఆర్మాక్స్ మీడియా నిర్వహించిన సర్వే ప్రకారం తెలుగు టాప్ 10 ఫిమేల్ స్టార్స్ లో సమంత మొదటి స్థానం దక్కించుకుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత పెళ్లి తర్వాత ఎక్కువ సినిమాలు చేయకుండా ఆచి తూచి చేసింది. ఇప్పుడు విడాకుల తర్వాత వరుస సినిమాలకి ఓకే చెప్తూ దూసుకుపోతుంది కెరీర్ లో. అంతే కాక ఇటీవల ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో బాలీవుడ్లో కూడా అభిమానులని సంపాదించుకొని, ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ తో దేశం మొత్తాన్ని ‘ఊ అంటావా..’ అంటూ ఊపేసింది. దీంతో ఈ లిస్ట్ లో అందరి హీరోయిన్స్ ని వెనక్కి నెట్టేసి మొదటి స్థానంలో నిలిచింది.

Telugu Heros : ఆ సర్వేలో ఫస్ట్ ప్లేస్‌లో మహేష్ తర్వాతే అల్లు అర్జున్.. తర్వాతి స్థానాలు..

ఇక రెండవ స్థానంలో కాజల్ అగర్వాల్ నిలిచింది. ఆ తర్వాత మూడవ స్థానం నుంచి పదవ స్థానం వరకు వరసగా అనుష్క శెట్టి, పూజ హెగ్డే, తమన్నా, రష్మిక, కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి, రాశి ఖన్నా నిలిచారు.