Oscar Awards : ఇకపై ఆ సినిమాలకి ఆస్కార్ ఇవ్వం.. ఆస్కార్ అవార్డులకు పోటీ పడాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే..

ఆస్కార్ అవార్డులకు పోటీ పడాలంటే అందుకు కొన్ని రూల్స్ ఉంటాయి. పోటీ పడే సినిమాలు ఆ రూల్స్ ని కచ్చితంగా పాటించాల్సిందే. అలాంటి ముఖ్యమైన రూల్స్ లో..............

Oscar Awards : ఇకపై ఆ సినిమాలకి ఆస్కార్ ఇవ్వం.. ఆస్కార్ అవార్డులకు పోటీ పడాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే..

Oscars

Oscar Awards :   ఆస్కార్ అవార్డులకు పోటీ పడాలంటే అందుకు కొన్ని రూల్స్ ఉంటాయి. పోటీ పడే సినిమాలు ఆ రూల్స్ ని కచ్చితంగా పాటించాల్సిందే. అలాంటి ముఖ్యమైన రూల్స్ లో ఒకటి ఆస్కార్ అవార్డు పోటీల్లో పాల్గొనాలంటే ఆ సినిమా కచ్చితంగా థియేటర్లో రిలీజ్ అయి ఉండాలి. ఈ నిబంధన ఎప్పట్నుంచో ఉంది. అయితే గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఆస్కార్ నిర్వాహకులు కూడా ఈ నిబంధనని తొలగించారు.

దీంతో గత రెండు సంవత్సరాలు కొన్ని ఓటీటీలలో రిలీజ్ అయిన సినిమాలకి కూడా ఆస్కార్ అవార్డులు వరించాయి. అంతే కాక కొన్ని చిన్న సినిమాలకి కూడా ఈ అవార్డులు వచ్చాయి. దీంతో చాలా మంది సంతోషం వ్యక్తంచేశారు. బడ్జెట్ కారణంగా కొన్ని పెద్ద సినిమాలు, కొన్ని చిన్న సినిమాలు సమస్యలు ఎదుర్కొన్నా ఆస్కార్ లో గత రెండేళ్లు వాటికి కూడా ఎంట్రీ దొరికాయి. తాజాగా ఆస్కార్ నిర్వాహకులు మళ్ళీ నిబంధలని సడలించారు. కరోనా తగ్గడంతో పాటు, థియేటర్లు ఓపెన్ కూడా అవ్వడంతో మళ్ళీ పాత నిబంధనని తెచ్చింది ఆస్కార్.

Cannes 2022 : కాన్స్ ఫిలింఫెస్టివల్ లో షాకింగ్ సంఘటన.. అర్ధనగ్నంగా రెడ్ కార్పెట్ పై నినాదాలు..

ఇటీవలే 95వ ఆస్కార్ అవార్డులకు నోటిఫికేషన్ ఇచ్చింది అకాడమీ. ఈ సారి ఆస్కార్ పోటీల్లో పాల్గొనాలి అంటే ఆ సినిమా ప్రపంచంలోని ఏ థియేటర్లలోనైనా 2022 జనవరి 1నుంచి డిసెంబరు 31లోపు రిలీజ్‌ అయి ఉండాలి. అయితే కొన్ని దేశాల్లో ఇంకా నిబంధనలు కొనసాగుతుండటంతో చిన్న మినహాయింపు ఇచ్చారు. ఎంట్రీ దక్కాలంటే ఆ సినిమా అమెరికాలోని మెట్రోపాలిటిన్‌ ఏరియాలు అయిన లాస్‌ ఏంజిల్స్, న్యూయార్క్, చికాగో, మియామీ, అట్లాంటా లాంటి సిటీల్లో ఉన్న థియేటర్లలో అయినా ఆ సినిమా కచ్చితంగా రిలీజ్ అయి ఉండాలి అని నిబంధనలు పెట్టారు.

Vijay Devarakonda : ఖుషిలో విజయ్, సమంత లిప్‌లాక్??

చిన్న సినిమాల దర్శక నిర్మాతలకు ఇది షాకింగ్ న్యూస్. ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలకి కూడా చాలా అవార్డులు వచ్చాయి. ఈ సారి మళ్ళీ ఈ నిబంధన పెట్టడంతో ఈ సారి ఆస్కార్ అవార్డులకు కొన్ని సినిమాలు ఎంట్రీ సాధించవేమో అని అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయంపై కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేసినా ఈ నిబంధనలు గతంలో ఉన్నవే అని నిర్వాహకులు చెప్తున్నారు.

దీనితో పాటు మరి కొన్ని మార్పులు కూడా చేశారు ఆస్కార్ నిర్వాహకులు. డాక్యుమెంటరీ విభాగంలో ‘డాక్యుమెంటరీ ఫీచర్‌’ అవార్డు పేరుని ‘డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌’గా, ‘డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌’ పేరుని ‘డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌’గా మార్చారు. మ్యూజిక్‌ విభాగంలోని ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ కి గతంలో ఒక సినిమా నుంచి ఎన్నిపాటలైనా పంపించవచ్చు. కానీ ఇకనుంచి ఈ అవార్డు పోటీకి ఒక సినిమా నుంచి కేవలం మూడు పాటలనే పంపాలనే నిబంధనను విధించింది. అలాగే ‘బెస్ట్‌ సౌండింగ్‌’ అవార్డు విభాగానికి పోటీ పడాలంటే ఆ సినిమా ముందుగా సౌండ్‌ బ్రాంచ్‌ మెంబర్స్‌ చూసి ఓకే చేయాలి అనే నిబంధనని తీసుకొచ్చింది. ఇలా పలు మార్పులు చేసి ఈ సారి ఆస్కార్ అవార్డుని మరింత కట్టుదిట్టంగా చేయాలని అనుకుంటున్నారు.