Naatu Naatu Song : నాటు నాటు.. సాహిత్యం, ఫోక్ రెండూ కలిపి.. నాటు నాటు సాంగ్ చంద్రబోస్ పెన్ నుంచి జనాల మదిలోకి.. పాట లిరిక్స్ ఇవే..

నాటు నాటు పాటని లిరికిస్ట్ చంద్రబోస్ రాయగా, కీరవాణి సంగీత దర్శకత్వంలో రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దీనికి స్టెప్స్ కంపోజ్ చేశారు. సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చేందుకు ఎన్టీఆర్, చరణ్ కలిసి................

Naatu Naatu Song : నాటు నాటు.. సాహిత్యం, ఫోక్ రెండూ కలిపి.. నాటు నాటు సాంగ్ చంద్రబోస్ పెన్ నుంచి జనాల మదిలోకి.. పాట లిరిక్స్ ఇవే..

Oscar Nominated Naatu Naatu Song Lyrics history and full details about song

Naatu Naatu Song :  మరికొద్ది గంటల్లో ఆస్కార్ వేడుక జరగబోతుంది. ప్రపంచ సినీ ప్రేమికులంతా ఈ అవార్డు వేడుకల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం భారతదేశం నుంచి బెస్ట్ సాంగ్ ఒరిజినల్ విభాగంలో RRR సినిమా నాటు నాటు సాంగ్ నిలవడంతో భారతీయులకు ఈ ఆస్కార్ వేడుక మరింత ఆసక్తిగా ఉంది. దీనితో పాటు డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో అల్ ది బ్రీత్స్ సినిమాలు కూడా ఇండియా నుంచి నామినేషన్స్ లో నిలిచాయి. ఈ మూడు కూడా ఆస్కార్ అవార్డులు సాధించాలని భారతీయులంతా కోరుకుంటున్నారు.

నాటు నాటు సాంగ్ ప్రపంచమంతా ఒక ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సాంగ్ లో చరణ్, ఎన్టీఆర్ కాళ్లతో వేసిన స్టెప్ అయితే ప్రపంచమంతటా వైరల్ అయింది. అనేక దేశాల నుంచి అభిమానులు ఈ నాటు నాటు సాంగ్ కి స్టెప్పులు వేసి మరీ ఆ వీడియోల్ని సోషల్ మీడియాల్లో వైరల్ చేశారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా నాటు నాటు సాంగ్ అందరి కాళ్ళు కదిలించి స్టెప్ వేసేలా చేసింది.

నాటు నాటు పాటని లిరికిస్ట్ చంద్రబోస్ రాయగా, కీరవాణి సంగీత దర్శకత్వంలో రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దీనికి స్టెప్స్ కంపోజ్ చేశారు. సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చేందుకు ఎన్టీఆర్, చరణ్ కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అని రాజమౌళికి ఆలోచన రాగా పోటాపోటీగా డ్యాన్స్ చేసే ఓ పాట కావాలి అని కీరవాణికి చెప్తే ట్యూన్ రెడీ కాకుండానే చంద్రబోస్ ని పిలిచి తెలంగాణ, ఆంద్ర సాహిత్యం ఉండేలా, స్వతంత్రం ముందు ఉండే భాషలోని పదాలతో ఓ ఫాస్ట్ బీట్ సాంగ్ కావాలని అడిగారు. అలాగే ఇద్దరు హీరోలు డ్యాన్స్ చేయడానికి బాగా స్కోప్ ఉండాలి, అంత మాస్ సాంగ్ కావాలి అని చెప్పారు.

చంద్రబోస్ రెండు రోజుల్లోనే మూడు పల్లవులు రాసుకొని కీరవాణి దగ్గరికి వెళ్లారు. నా పాట చూడు, మిరపతోక్కు, దుముకులాడటం, పోట్ల గిత్త, కీసుపిట్ట, రచ్చబండ.. ఇలా సాహిత్యం, జానపదం కలిసే పదాలని జతచేర్చి పాటని రాశారు చంద్రబోస్. 90 శాతం పాట రెండు రోజుల్లో పూర్తయింది. కానీ ఇందులో పదాలు మారుస్తూ, చేరుస్తూ, ట్యూన్ కంపోజ్ చేస్తూ పూర్తి పాట రెడీ అయి పాడించేసరికి ఏకంగా 19 నెలలు పట్టింది. ఈ 19 నెలలు పాట గురించి చర్చిస్తూనే ఉన్నారట.

ఇక ఈ పాటని 17 రోజులు ఉక్రెయిన్ అధ్యక్ష భవనం ముందు షూట్ చేశారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మెయిన్ స్టెప్స్ 100 వరకు కంపోజ్ చేయగా చివరికి రాజమౌళి ఆ కాళ్ళ స్టెప్ ఓకే చేశాడు. ఇప్పుడు ఆ స్టెప్ ప్రపంచమంతా చుట్టేస్తోంది. నాటు నాటు అంటూ పాట రిలీజ్ అయ్యాక బాగా వైరల్ అయి మంచి ఫేమ్ వచ్చింది. ఇక సినిమా రిలీజయ్యాక ఈ పాటకి, పాట లోని విజువల్స్ కి మరింత పేరు వచ్చింది. హాలీవుడ్ ప్రేక్షకులకు ఈ మాస్ బీట్ సాంగ్ నచ్చి దీన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. నాటు నాటు పాటకి ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. ఏకంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా గెలిచి చరిత్ర సృష్టించింది. ఏకంగా నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్కార్ వేడుకలు ఉండటంతో మరోసారి అంతా నాటు నాటు సాంగ్ ని తెగ వినేస్తున్నారట. హాలీవుడ్ లో కూడా ఈ పాట తెగ మారుమ్రోగిపోతుంది.

Oscars 2023 : ఆస్కార్ .. ఎప్పుడు? ఎక్కడ? ఎందులో చూడొచ్చు?

నాటు నాటు సాంగ్ లిరిక్స్..

పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకుని కర్రసాము సేసినట్టు
మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు

నా పాట సూడు.. నా పాట సూడు.. నా పాట సూడు..
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు
పచ్చి మిరప లాగ పిచ్చ నాటు
నాటు నాటు నాటు
విచ్చు కత్తి లాగ వెర్రి నాటు

గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలా కీసు పిట్ట కూసినట్టు
ఏలు సిటికెలేసేలా యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా దుమారం రేగినట్టు
ఒల్లు సెమటపట్టేలా వీరంగం సేసినట్టు

నా పాట సూడు.. నా పాట సూడు.. నా పాట సూడు..
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు గడ్డపార లాగ చెడ్డ నాటు
నాటు నాటు నాటు ఉక్కపోత లాగ తిక్క నాటు

భూమి దద్దరిల్లేలా వొంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా
ఏసేయరో యకాయకి నాటు నాటు నాటో..
దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా
దుముకు దుముకులాడేలా దూకేయరో సరాసరి
నాటు నాటు నాటో