Oscars 2021 : ‘ఆమె’ ఆస్కార్‌తో మెరిసిన వేళ…

‘ఆస్కార్‌.. తెల్ల జాతీయులకే సొంతం.. నల్ల జాతీయులకు చోటు ఉండదనే విమర్శ ఎక్కువగా వినిపించేది.. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఊహించిన రీతిలో ఆస్కార్ అవార్డుల ఉత్సవం జరిగింది.

Oscars 2021 : ‘ఆమె’ ఆస్కార్‌తో మెరిసిన వేళ…

Oscars 2021

Oscars 2021-Nomadland’s Chloe Zhao : ‘ఆస్కార్‌.. తెల్ల జాతీయులకే సొంతం.. నల్ల జాతీయులకు చోటు ఉండదనే విమర్శ ఎక్కువగా వినిపించేది.. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఊహించిన రీతిలో ఆస్కార్ అవార్డుల ఉత్సవం జరిగింది. ఈసారి తెల్ల జాతీయులను పక్కనబెట్టి నల్లజాతీయులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు ఆస్కార్ పెద్దలు.. నల్లజాతీయులపై పెద్ద మనస్సు చేసుకోవడంతో ఆస్కార్ అవార్డులతో మెరిశారు. దాదాపు ఐదేళ్లుగా ‘అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ విమర్శల పాలవుతోంది.

నల్ల జాతీయులంతా కలిసి నిర్మించిన ‘నొమాడ్‌ ల్యాండ్‌’ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసింది. ఈ సినిమా వసూళ్ల పరంగా పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఉత్తమ దర్శకుడు, నటుడు, నటీమణి.. మూడు ప్రధాన విభాగాల్లో అవార్డు దక్కించుకుంది. ఆరు నామినేషన్లు దక్కించుకున్న ‘నొమాడ్‌ ల్యాండ్‌’ మూడు అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రానికిగాను ఉత్తమ దర్శకురాలిగా ఎంపికయ్యారు క్లో జావ్‌ (39). దర్శకుల విభాగంలో అవార్డు అందుకున్న రెండో మహిళ, తొలి ఆసియన్‌ మహిళ కూడా క్లో జావే.

క్లోయీ జావ్‌ పుట్టింది చైనాలోనే.. ఆమె తండ్రి చైనాలోని స్టీల్‌ కంపెనీ షౌగాంగ్‌ గ్రూప్‌లో టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ గా పనిచేసేవారు. తల్లి వైద్యరంగంలో పనిచేసేవారు. జపాన్‌ కామిక్‌ పుస్తకాలను ఇష్టంగా చదివే క్లోను ఎలా మాన్పించాలో తండ్రికి తెలియలేదు. చివరికి ఇంగ్లిష్‌ రాకపోయినా క్లోని లండన్‌లోని బోర్డింగ్‌ స్కూల్లో చేర్పించాడు. అనంతరం క్లో తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి చైనాలో హాస్యనటిగా పేరొందిన సాంగ్‌డాండన్‌ని వివాహం చేసుకున్నాడు.

క్లో లండన్‌ నుంచి లాస్‌ఏంజలెస్‌ వెళ్లి పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. తనకెంతో ఇష్టమైన సినిమాల్లో అడుగుపెట్టేందుకు న్యూయార్క్‌ యూనివర్సిటీ టిచ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో చేరింది. నోమాడ్‌ల్యాండ్‌ కంటే ముందు క్లో తీసిన సినిమాలు రెండే రెండు.. ఉత్తమ మహిళా దర్శకులకు అందించే 50,000 డాలర్లని క్లో అందుకుంది. ఈసారి డైరెక్షన్, మేకప్, హెయిర్‌ స్టయిలింగ్, కాస్ట్యూమ్స్‌ డిజైనింగ్, ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే తదితర విభాగాల్లోనూ మహిళలు రాణించడం విశేషం.

మొత్తం 15కి పైగా అవార్డులు అతివల సొంతమయ్యాయి. కోవిడ్‌ కారణంగా వీక్షకులను వేడుకకు అనుమతించలేదు. ఒకే వేదిక మీద జరిగే ఆస్కార్‌ అవార్డు వేడుక.. కోవిడ్‌ కారణంగా ఈసారి రెండు వేదికలు లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్, యూనియన్‌లో అవార్డు వేడుక జరిగింది.