Tollywood : టాలీవుడ్ సినిమాలకు ఇతర ఇండస్ట్రీ మ్యూజిక్ డైరెక్టర్ల సంగీతం.. NTR30 టు Nani30..

టాలీవుడ్ లో రాబోయే మోస్ట్ అవైటెడ్ మూవీస్ అన్నిటికి ఇతర ఇండస్ట్రీ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, నితిన్..

Tollywood : టాలీవుడ్ సినిమాలకు ఇతర ఇండస్ట్రీ మ్యూజిక్ డైరెక్టర్ల సంగీతం.. NTR30 టు Nani30..

other industry music directors for tollywood crazy projects

Tollywood : టాలీవుడ్ లో ఈ రెండేళ్లలో చాలా మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఉన్నాయి. కొన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అయితే కొన్ని హిట్ కాంబినేషన్స్, మరికొన్ని క్రేజీ కాంబినేషన్స్. RRR వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా NTR30. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ ప్రాజెక్ట్-K (Project K) చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్, సాలార్ కి (Salaar) కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం ఇస్తున్నారు.

Naga Chaitanya : చైతన్యకి మాస్ ఇమేజ్‌ని తీసుకొచ్చిన లవ్ స్టోరీ.. తెర వెనక కథ ఏంటో తెలుసా?

వెంకటేష్ కెరీర్ లో 75వ సినిమాగా తెరకెక్కుతున్న సైంధవ్ (Saindhav) సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తుండగా నాని 30వ చిత్రానికి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం ఇస్తున్నాడు. అలాగే విజయ్ దేవరకొండ ఖుషి (Kushi) మూవీకి కూడా అబ్దుల్ వాహబే మ్యూజిక్ అందిస్తున్నాడు. విజయ్ మరో మూవీ VD12 కి అనిరుద్ మ్యూజిక్ చేస్తున్నాడు. ఇక భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ మరోసారి ఆ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ VNRtrio ప్రాజెక్ట్ ని ఇటీవలే అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకి తమిళ సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. అలాగే మెగా హీరో వైష్ణవ తేజ్ PVT04 సినిమాకి కూడా జి వి ప్రకాష్ సంగీతమే.

Pushpa 2 : పుష్ప 2 షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా??

నితిన్, వక్కంతం వంశీ కలయికలో వస్తున్న Nithiin32 కి హరీష్ జైరాజ్, విశ్వక్ సేన్ VS11 కి యువన్ శంకర్ రాజా, RX100 డైరెక్టర్, పాయల్ రాజ్‌పుత్ కాంబినేషన్ లో వస్తున్న మంగళవారం సినిమాకి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఆల్రెడీ రిలీజ్ అయిన కస్టడీకి యువన్ శంకర్, విరూపాక్షకి అజనీష్ మ్యూజిక్ అందించారు. అలాగే రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో రాబోతున్న RC16 కి ఎ ఆర్ రెహమాన్ ని తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి టాలీవుడ్ మేకర్స్ కి ఇతర ఇండస్ట్రీ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి.