Bheemla Nayak: ఓటీటీల పోటీ.. రికార్డు ధర పలికిన భీమ్లా నాయక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన భీమ్లా నాయక్ పై ఫస్ట్ నుంచి ఎక్స్ పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉన్నాయి. దానికి తగ్గట్టే ఈ మూవీ టీజర్, సాంగ్స్.. సూపర్ రెస్పాన్స్..

Bheemla Nayak: ఓటీటీల పోటీ.. రికార్డు ధర పలికిన భీమ్లా నాయక్!

Bheemla Nayak

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన భీమ్లా నాయక్ పై ఫస్ట్ నుంచి ఎక్స్ పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉన్నాయి. దానికి తగ్గట్టే ఈ మూవీ టీజర్, సాంగ్స్.. సూపర్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. థియేటర్స్ కి పవన్ ఎప్పుడొస్తారా అని కాచుక్కూర్చున్నారు ఫ్యాన్స్. భీమ్లానాయక్ కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ సైతం నమ్మకంతో ఉంది. ఎప్పుడొచ్చామన్నది కాదు.. సినిమాలో విషయముంటే బాక్సు బద్దలే అని అఖండ లాంటి సినిమాలు లేటెస్ట్ మార్క్ సెట్ చేశాయి.

NBK107: ఆగని లీకులు.. బాలయ్య సినిమాకూ ఎఫెక్ట్!

అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్లే ఫిబ్రవరి 25న థియేటర్లకు వచ్చేస్తామని ధీమాగా చెప్పేశారు భీమ్లా నాయక్ మేకర్స్. దీంతో ఇండస్ట్రీలో ఒకరకమైన ఉత్కంఠ నెలకొనగా.. ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా బిజినెస్ కూడా పూర్తయిపోయినట్లు తెలుస్తుంది. థియేట్రికల్ రైట్స్ ఎలా ఉన్నా.. ఈ మధ్య కాలంలో ఓటీటీల మధ్య పోటీ గురించి తెలిసిందే కదా.. అలాంటిది పవర్ స్టార్ సినిమా అంటే ఎలా వదులుకుంటాయి. అందుకే భీమ్లా కోసం ఓటీటీలు పోటీకి దిగి రికార్డు ధరను ఆఫర్ చేశాయట.

Project K : ప్రభాస్‌తో పని చేయడం నాకు గౌరవం.. ప్రభాస్‌పై అమితాబ్ ట్వీట్..

ఫైనల్ గా భీమ్లా నాయక్ సినిమాను ఆహాతో కలిసి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ హక్కుల్ని దక్కించుకుందని చెబుతున్నారు. డిస్నీ హాట్ స్టార్ దేశవ్యాప్తంగా పేరుంది. తెలుగు వారి వేదికగా ఆహా మనసులను గెలుచుకుంది. ఇవి రెండూ కలిసి రికార్డు ధరకి భీమ్లా హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేనంత ధర చెల్లించి స్ట్రీమింగ్ హక్కులను గెలుచుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తుంది.