OTT Release Films: తగ్గేదేలే.. ఈ వారం ఓటీటీలో సినిమాలివే!

ఎప్పటిలాగానే ఈ వారం కూడా తగ్గేదే లే అంటున్నాయి ఓటీటీలు. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ తన పుష్పక విమానాన్ని ఆహాకి తీసుకురాబోతున్నాడు.

OTT Release Films: తగ్గేదేలే.. ఈ వారం ఓటీటీలో సినిమాలివే!

Ott Release Films

OTT Release Films: ఎప్పటిలాగానే ఈ వారం కూడా తగ్గేదే లే అంటున్నాయి ఓటీటీలు. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ తన పుష్పక విమానాన్ని ఆహాకి తీసుకురాబోతున్నాడు. ఇక డిజిటల్ ప్లాట్ ఫాంపై సుస్మితాసేన్ మళ్లీ నెవర్ బిఫోర్ రేంజ్ లో మెస్మరైజ్ చేస్తానంటోంది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా రీసెంట్ గా థియేటర్స్ కొచ్చిన మూవీ ‘పుష్పకవిమానం’. నవంబర్12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్వద్ద పర్వాలేదనిపించింది. ఇంప్రెస్సివ్ స్టోరీ అనిపించుకుంది. డిసెంబర్10వ నుంచి అచ్చ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. దామోదర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్అమాయకుడైన స్కూల్టీచర్రోల్ లో కనిపిస్తాడు. కామెడీ, సస్పెన్స్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా విజయ్దేవరకొండ నిర్మించి ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ చేసాడు.

Pushpa: పుష్పరాజ్ కోసం ఈ ఇద్దరూ.. ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్

డిసెంబర్ 10న ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ ఓటీటీల్లో పోటీ పడుతున్నారు. ప్రామినెంట్ క్లాష్ గా తీసుకోవాలంటే అరణ్యక్, ఆర్య సీజన్ 2 గురించి చెప్పుకోవాలి. డిసెంబర్ 10న నెట్ ఫ్లిక్స్ లో అరణ్యక్ స్ట్రీమింగ్ కాబోతుంటే అదే రోజు డిస్నీ హాట్ స్టార్ లో ఆర్య సీజన్ 2 స్ట్రీమింగ్ కి రెడీఅయింది. నిజానికి వీటిలో విన్నర్ గా నిలిచే ఛాన్స్ ఆర్యకే ఉంది. ఎందుకంటే గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ తో ఆర్య సీజన్ 1 ప్రతిఒక్కరినీ కట్టిపడేసింది. సుస్మితా సేన్ యాక్షన్ మేజర్ సెల్లింగ్ పాయింట్. సో ఆడియెన్స్ వెయిట్ చేస్తోన్న ఆర్య సీజన్ 2 డిసెంబర్ 10న బిగ్ సక్సెస్ కొట్టొచ్చు.

Tollywood Directors: రెడీ బాబూ రెడీ.. ఈ దర్శకుల సినిమాలు మొదలెప్పుడు?

ఏమో గుర్రం ఎగరావచ్చు టైప్ లో అరణ్యక్ సడెన్ సర్ ప్రైజ్ చేసినా ఆశ్చర్యం లేదు. రీసెంట్ గా రిలీజైన అరణ్యక్ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ చూస్తుంటే ఆడియెన్స్ కు కనెక్టయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. రవీనా టండన్, పరమ్ బత్ర ఛటర్జీ, అశుతోష్ రాణా వంటి వారు కీ రోల్స్ చేసిన ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ బాగానే ప్రమోట్ చేస్తుంది. మరి సీనియర్ హీరోయిన్స్ మధ్య పోటీలో.. ఆర్యతో సుస్మితా సేన్ గెలుస్తుందో.. అరణ్యక్ తో రవీనా సక్సెస్ కొడుతుందా అన్నది సస్పెన్స్ గా మారింది.

SSMB 28: క్రేజీ అప్డేట్.. మహేష్-త్రివిక్రమ్ సినిమాలో సంజయ్ పాత్ర ఇదే?

డిసెంబర్ 6న ది లైట్ హౌజ్ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. రాబర్ట్ పాటిన్సస్, విల్లెమ్ డెఫె లీడ్ రోల్స్ చేసారు. 1890 సంవత్సరంలో న్యూ ఇంగ్లండ్ ఐలాండ్ లో జరిగిన మిస్టరీగా ఈ సినిమాను చూపించబోతున్నారు. థ్రిల్లర్ ప్యాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఇంగ్లీష్ లాంగ్వెజ్ లో మాత్రమే ప్రస్తుతానికి స్ట్రీమింగ్ అవుతుంది. ఈమధ్యే ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన ఛోరీ మూవీతో పేరుతెచ్చుకున్న డైరెక్టర్ విశాల్ ఎక్కువ గ్యాప్ అవ్వకుండా మరో హారర్ మూవీ బాలిని ఓటీటీలో చూపించబోతున్నాడు. స్వప్నిల్ జోషి, పూజా సావంత్ లీడ్ రోల్స్ చేసారిందులో. డిసెంబర్ 9న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజై ఫిల్మ్ పై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. అయితే ప్రస్తుతానికి మరాఠీ భాషల్లో మాత్రమే రిలీజ్ కాబోతుంది.

Theater Release Films: ఊరించి ఉడికించి ఈ వారం థియేటర్‌లో వచ్చేస్తున్న సినిమాలు!