OTT Releases: ఓటీటీ జాతర.. టీవీలకు అతుక్కుపోయే కంటెంట్ సిద్ధం!

క్రిస్ మస్, న్యూ ఇయర్ స్పెషల్ గా మస్తీ సరుకును సిద్ధం చేశాయి ఓటీటీలు. హాలీడే సీజన్ లో స్మార్ట్ స్క్రీన్స్ కు అతుక్కుపోయేలా కంటెంట్ ను వదులుతున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే..

OTT Releases: ఓటీటీ జాతర.. టీవీలకు అతుక్కుపోయే కంటెంట్ సిద్ధం!

Ott Releases

OTT Releases: క్రిస్ మస్, న్యూ ఇయర్ స్పెషల్ గా మస్తీ సరుకును సిద్ధం చేశాయి ఓటీటీలు. హాలీడే సీజన్ లో స్మార్ట్ స్క్రీన్స్ కు అతుక్కుపోయేలా కంటెంట్ ను వదులుతున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే రిలీజైతే మరికొన్ని ఒక్కొక్కటిగా న్యూ ఇయర్ ఎంట్రీ వరకు దిగబోతున్నాయి. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, కోలీవుడ్ స్టార్ ధనుశ్ కలిసి అత్రాంగి రే సినిమాతో హాట్ స్టార్ డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేశారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సారా అలీఖాన్ హీరోయిన్. అత్రాంగి రే మూవీపై పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.

Back Door Review: హద్దులు దాటమనే వయసు.. తప్పని చెప్పే మనసు.. ‘బ్యాక్ డోర్’

ఫస్ట్ టైమ్ మలయాళీ ఇండస్ట్రీ నుంచి పాన్ వరల్డ్ మూవీగా నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసిన సూపర్ హీరో ఫిల్మ్ మిన్నాల్ మురళీ. టోవినో థామస్ లీడ్ రోల్ చేసిన ఈ అడ్వాంచరస్ కామెడీ ఫిల్మ్.. ఈ వీక్ ఓటీటీ పర్ఫెక్ట్ వాచ్ గా పేరు తెచ్చుకుంటోంది. థియేటర్స్ లో రీసెంట్ గానే రిలీజైన జాన్ అబ్రహం సత్యమేవ జయతే2.. అమెజాన్ ప్రైమ్ లో ఎంట్రీ ఇచ్చేసింది. అలాగే ప్రైమ్ లో ది సూసైడ్ స్క్వాడ్ ఇంగ్లీష్ మూవీ.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ప్లే అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో మోస్ట్ అవైటైడ్ హాలీవుడ్ ప్లిక్ డోంట్ లుక్ అప్ తో పాటూ కొరియన్ సైన్స్ ఫిక్షన్ ది సైలెంట్ సీ రిలీజయ్యాయి.

Omicron Effect on Films: టెన్షన్.. టెన్షన్.. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో?!

విజయ్ సేతుపతి, శృతీహాసన్ నటించిన లాభం ఆహా వేదికగా 24నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా కిడ్స్ కోసం క్రిస్ మస్ తాత అనే యానిమేటెడ్ ఫిల్మ్ ను రిలీజ్ చేసింది. హాట్ స్టార్ లో యానిమేషన్ అడ్వంచర్ ఎంకాంటోతో పాటూ తెలుగు వెబ్ సిరీస్ పరంపర స్ట్రీమింగ్ అవుతోంది. జీ5లో సల్మాన్ – ఆయుశ్.. అంతిమ్, తమిళ్ సినిమా బ్లడ్ మనీ, కన్నడ భజరంగీ2ల షోలు స్టార్ట్ అయ్యాయి. సోనీలివ్ లో శింభు లేటెస్ట్ హిట్ మానాడుతో పాటూ తెలుగు డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ రన్ అవుతూ ఆడియెన్స్ కు క్రిస్ మస్ ట్రీట్ ఇస్తున్నాయి.

Ashu Reddy Oo Antava Song: ఊ అంటావా మావా.. ఇరగదీసిన అషు!

ఇక న్యూ ఇయర్ రేస్ లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఓటీటీల్లో దిగబోతున్నాయి. డిసెంబర్ 29న ఇంగ్లీష్ తో పాటూ తెలుగు, హిందీ, తమిల్ భాషల్లో ది బుక్ ఆప్ బోబా ఫెట్.. హాట్ స్టార్ ప్లాట్ ఫాంపై సందడి చేయబోతుంది. నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ 31 కోబ్రా కాయ్ సీజన్ 4, ది లాస్ట్ డాటర్ సినిమాలు రాబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో జనవరి 1 స్పెషల్ గా హారిపోట్టర్ ట్వంటింత్ యానివర్సరీ.. రిటర్న్ టు హోగ్ వార్ట్స్ ను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇక ఆహా వేదికగా న్యూ ఇయర్ స్పెషల్ గా రాజేంద్రప్రసాద్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ సేనాపతి విడుదల కాబోతుంది.