Movie Releases: నీ ప్రతాపమా.. నా ప్రతాపమా.. ధియేటర్లు-ఓటీటీల ఎంటర్‌టైన్‌మెంట్ ఫైట్!

అసలు ఎంటర్ టైన్ మెంట్ ఫైట్ స్టార్ట్ అవుతోంది. అటు ధియేటర్లు, ఇటు ఓటీటీలు ఏమాత్రం తగ్గకుండా.. టఫ్ కాంపిటీషన్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాయి.

Movie Releases: నీ ప్రతాపమా.. నా ప్రతాపమా.. ధియేటర్లు-ఓటీటీల ఎంటర్‌టైన్‌మెంట్ ఫైట్!

Movie Releases

Movie Releases: అసలు ఎంటర్ టైన్ మెంట్ ఫైట్ స్టార్ట్ అవుతోంది. అటు ధియేటర్లు, ఇటు ఓటీటీలు ఏమాత్రం తగ్గకుండా.. టఫ్ కాంపిటీషన్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాయి. వరల్డ్స్ బిగ్గెస్ట్ మూవీస్ తో ఫాన్స్ ని ఎంగేజ్ చెయ్యడానికి నేనంటే.. నేనంటూ పోటీపడుతున్నాయి. మరి ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్ లేంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

OTT Release: గెట్ రెడీ.. ఓటీటీలో బ్లాక్ బస్టర్ బిగ్ మూవీస్!

చూస్కుందాం.. నీ ప్రతాపమో.. నా ప్రతాపమో అంటూ ఈ వారం బరిలోకి దిగుతున్నాయి అటు ఓటీటీలు, ఇటు ధియేటర్లు. ఈ వారం వరల్డ్ మొత్తం వెయిట్ చేస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవుతోంది. ఎప్పుడెప్పుడా అని ఆడియన్స్ వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ మొత్తానికి అన్ని అడ్డంకులు దాటుకుని మార్చి 25న ధియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

RRR: ట్రిపుల్‌ఆర్ నెవర్ బిఫోర్ ప్రమోషన్స్.. కుంభస్థలాన్ని కొట్టేస్తారా?

రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ తో గ్రాండ్ గా రాజమౌళి తెరకెక్కించిన సినిమా ట్రిపుల్ఆర్. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో భారీ విజువల్స్ తో గ్రాండ్ గా తెరకెక్కించిన ట్రిపుల్ఆర్ వరల్డ్ వైడ్ గా రికార్డ్ థియేటర్లలో ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాకు భారీగా బ్యాక్ టూ బ్యాక్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న టీమ్.. అది పోస్ట్ పోన్ అవ్వడంతో మరోసారి సినిమా మీద హైప్స్ పెంచడానికి పీక్స్ లో ప్రమోషన్లు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

RRR: అమెరికాలో తారక్ క్రేజ్.. ‘జై ఎన్టీఆర్-ఆర్ఆర్ఆర్’ కార్ ర్యాలీ!

మార్చి 25న ట్రిపుల్ ఆర్ నెవర్ బిఫోర్ అన్నట్టు గ్రాండ్ గా ధియేటర్లో రిలీజ్ అవుతుంటే.. ఓటీటీలో ఒక రోజు ముందే రిలీజ్ కు రెడీ అయ్యింది పవర్ స్టార్ మూవీ భీమ్లానాయక్. పవన్ కళ్యాణ్, రానా లీడ్ రోల్స్ లో సాగర్ చంద్ర డైరెక్షన్లో తెరకెక్కి ఆల్రెడీ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో ధియేటర్లో రిలీజ్ అయిన భీమ్లానాయక్ రికార్డ్ కలెక్షన్లతో సూపర్ హిట్ అయ్యింది.

Bheemla Nayak: గుడ్ న్యూస్.. ఒకరోజు ముందే ‘ఆహా’లో భీమ్లా నాయక్!

ధియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన భీమ్లానాయక్.. మార్చి 24న ఆహాలో రిలీజ్ కు రెడీ అయ్యింది. అచ్చతెలుగు ఓటీటీ యాప్ ఆహాలో పవర్ స్టామ్ ని చూపించబోతున్నాయి. మాస్ రివేంజ్ కాప్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రిలీజ్ అయిన భీమ్లా.. కలెక్షన్లతో బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. ఇప్పుడు ఓటీటీలో ఫాన్స్ ని పవర్ ఫుల్ గా ఎంటర్ టైన్ చెయ్యడానికొస్తోంది భీమ్లానాయక్.

Bheemla Nayak Bike: ‘ఆహా’ బంపర్ ఆఫర్.. పవన్ బైక్ సొంతం చేసుకొనే ఛాన్స్!

అటు ఆర్ఆర్ఆర్.. ఇటు పవర్ స్టార్.. రెండు సునామీలు సినీ లవర్స్ కోసం రంగంలోకి దిగాక.. ఇక వేరే సినిమాలు ఏ ధైర్యంతో సినిమా రిలీజ్ లు పెట్టుకుంటాయి..? కానీ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా ఫిబ్రవరి 24న రిలీజైన ‘వలిమై’ కూడా అదే రోజు ఓటీటీలో రానుంది. హెచ్. వినోద్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ విలన్‌గా నటించి మెప్పించాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా హిట్‌ కొట్టన ‘వలిమై’ కూడా మార్చి 25 నుంచి ప్రముఖ ఓటీటీ వేదికా ‘జీ5’లో ప్రదర్శితం కానుంది. మరికొన్ని హాలీవుడ్ క్రేజీ వెబ్ సిరీస్ లు, సినిమాలు కూడా మూవీ లవర్స్ కోసం ఈవీక్ ఎంటర్ టైన్ మెంట్ కి రెడీ అవుతున్నాయి.

Valimai: ఓటీటీలో అజిత్ యాక్షన్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ లియెన్ డైరెక్షన్లో సైంటిఫిక్ అడ్వంచరస్ ఫిక్షన్ డ్రామా ప్యార్లల్స్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వీక్ రిలీజ్ అవుతోంది. కాన్ స్టెన్స్, ఎరిక్ జంగ్ మాన్, జెస్సికా లీడ్ రోల్స్ లో ప్యార్లల్ ఎర్త్స్ మధ్య ట్రావెల్ చేసే ఈ సైంటిఫిక్ డ్రామా 2015లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ కోసం మార్చి 23 నుంచి అవైలబుల్ గా ఉంటోంది.

OTT Release: గెట్ రెడీ.. ఓటీటీలో బ్లాక్ బస్టర్ బిగ్ మూవీస్!

యాక్షన్ ఎడ్వెంచరస్ లవర్స్ కోసం ఈ వీక్ ఓటీటీలో పోటీ పడి మరీ కంటెంట్ అందిస్తున్నాయి. ఆల్రెడీ ఈ 23న ప్యార్లల్స్ రిలీజ్ అవుతుంటే.. యాక్షన్ అడ్వెంచరస్ సైఫై డ్రామా హాలో మూవీ.. మార్చి 24 నుంచి వూట్ యాప్ లో రిలీజ్ అవుతోంది. పాబ్లో, ఎరిన్ హాన్, కేట్ కెనడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ టీవీ షో టీజర్స్ తోనే ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది.

OTT Releases: థియేటర్‌లో స్టార్ మూవీస్.. అయినా తగ్గని ఓటీటీలు!

మరో యాక్షన్ అడ్వెంచర్ మూవీ డ్యూన్.. ఇంగ్లీష్, హిందీతో పాటు అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతోంది. మార్చి 25న ఈ మూవీ అమెజాన్, బుక్ మై షో యూట్యూబ్.. హంగామా ఓటీటీల్లో అవైలబుల్ గా ఉంటోంది. హాలీవుడ్ క్రేజీ సిరీస్ బ్రిడ్జర్ టన్ సీజన్ 2 నెట్ ఫ్లిక్స్ లో మార్చి 25 నుంచి స్ట్రీమ్ కాబోతోంది.