RRR Trailer: మా థియేటర్‌కి బందోబస్త్ కావాలి.. పోలీసులకు రిక్వెస్ట్ లెటర్!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మరో విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా స్థాయి సినిమా.. అందునా తారక్, రామ్ చరణ్ లాంటి సాలిడ్ హీరోలు.. చరిత్రను టచ్ చేసే సినిమా..

RRR Trailer: మా థియేటర్‌కి బందోబస్త్ కావాలి.. పోలీసులకు రిక్వెస్ట్ లెటర్!

Rrr Trailer

RRR Trailer: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మరో విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా స్థాయి సినిమా.. అందునా తారక్, రామ్ చరణ్ లాంటి సాలిడ్ హీరోలు.. చరిత్రను టచ్ చేసే సినిమా.. బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు తీసుకొచ్చిన నటీనటులు.. ఇదో ఇంటర్నేషనల్ ప్యాకేజీగా మార్చేసి ఆర్ఆర్ఆర్ అంచనాలను ఆకాశానికి పెంచేశాడు జక్కన్న. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్, గ్లింప్స్, లిరికల్ వీడియోలకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Bhola Shankar: చిరు జెట్ స్పీడ్.. షూట్ అప్డేట్స్ ఇచ్చిన యూనిట్!

ఇక ఇప్పుడు ట్రైలర్ కి కూడా ముహూర్తం ఆసన్నమైంది. డిసెంబర్ 9న ఒకేరోజు దేశంలోని అన్ని బాషలలో ట్రైలర్స్ విడుదల చేయనున్నారు. ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నాలుచోట్ల స్వయంగా సినిమా యూనిట్ చేతుల మీదుగానే ఈ ట్రైలర్ విడుదల కానుంది. తెలుగులో ఈ ట్రైలర్ విడుదల కాగానే.. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో ఈ సినిమా ట్రైలర్ ని ప్రదర్శితం చెయ్యడానికి థియేటర్స్ కూడా రెడీ అవుతున్నాయి.

Bheemla Nayak : భీమ్లాలో బ్రహ్మానందం..

అయితే ఈ సమయంలో తమ థియేటర్స్ కి సెక్యూరిటీ కావాలని వైజాగ్ కి చెందిన ప్రముఖ థియేటర్స్ సంగం, శరత్ యాజమాన్యం పోలీసులని విశేషం. రేపు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల సమయంలో మా ట్విన్ థియేటర్స్ కి ప్రొటెక్షన్ కావాలని డిసెంబర్ 8న థియేటర్ల యాజమాన్యం లెటర్ ప్యాడ్ మీద పోలీసులకు బందోబస్తు రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంది. ఆ సమయంలో పెద్ద ఎత్తున అభిమానులు మా థియేటర్ కి వచ్చే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా ఈ లెటర్ పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది.

TV Actress Lahari: బైక్‌ను ఢీకొట్టిన సీరియల్ నటిలహరి

ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలో ఇదే థియేటర్స్ లో పవన్ నటించిన వకీల్ సాబ్ ట్రైలర్ ప్రదర్శించినపుడు పెద్ద ఎత్తున అభిమానులు పోటెత్తడంతో పరిస్థితి అదుపుతప్పింది. అభిమానుల ధాటికి థియేటర్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ ఘటనలను దృష్టిలో పెట్టుకొనే ఆర్ఆర్ఆర్ లాంటి మల్టీస్టారర్ సినిమాకి ఇంకెంత క్రేజ్ ఉంటుందోనని ముందుగానే ఇపుడు ట్రైలర్ ప్రదర్శనకి విశాఖ ఏసీపీకి బందోబస్త్ నిమిత్తం లెటర్ పంపారు.