Sonu Sood : 18 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు, ఎవ్వరూ చనిపోకూడదనేది లక్ష్యం – సోనూ సూద్

కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ రోగుల బాధలు అంతా ఇంత కాదు. భారతదేశంలో ఆక్సిజన్ అందక, మందులు దొరక్క.. బెడ్స్ కూడా అందుబాటులో లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో వారంతా ఒక్కే ఒక్కడిని నమ్ముకున్నారు. ఆయనే సినీ యాక్టర్ సోనూ సూద్.

Sonu Sood : 18 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు, ఎవ్వరూ చనిపోకూడదనేది లక్ష్యం – సోనూ సూద్

Oxygen Plants

Oxygen Plants Sonu Sood : కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ రోగుల బాధలు అంతా ఇంత కాదు. భారతదేశంలో ఆక్సిజన్ అందక, మందులు దొరక్క.. బెడ్స్ కూడా అందుబాటులో లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో వారంతా ఒక్కే ఒక్కడిని నమ్ముకున్నారు. ఆయనే సినీ యాక్టర్ సోనూ సూద్. ఆపద్భాందవుడిగా కరోనా రోగులకు సాయం చేస్తున్నారు. అడిగిన వారికి లేదని అనకుండా..తోచిన విధంగా సహాయం చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా..ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణంపై కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ యాక్టర్.

వివిధ రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తానని ఇదివరకే ప్రకటించారు ఈయన. వివిధ రాష్ట్రాలలో 18చోట్ల ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు సోనూ సూద్. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించే హాస్పిటల్స్ దగ్గర వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని సోనూ సూద్ వెల్లడించారు. ఆక్సిజన్ తో ఎవ్వరూ చనిపోకూడదు అనేది తమ లక్ష్యమని, వచ్చే నెల నుంచి ఆక్సిజన్ ప్లాంట్స్ ప్రారంభమవుతాయని తెలిపారు.

మూవీ రీల్‌లో విలన్‌గా మెప్పించిన ఆయన.. ఇప్పుడు రియల్ హీరోగా మారిపోయారు. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటి వరకూ అడిగి వారికి లేదనకుండా సాయం చేస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్‌లో ఎంతో మంది కడుపులు నింపారు. వలస కార్మికులను సొంత డబ్బుతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి మరీ స్వస్థలాలకు పంపారు. అంతే కాదు దేశవ్యాప్తంగా అనేక మందికి సాయం చేశారు సోనూసూద్.

సెకండవేవ్‌లో కోవిడ్ రోగులకు ప్రాణాలు పోస్తున్నారు. మన దేశంలో తీవ్రమైన ఆక్సిజన్ కొరత నెలకొన్న నేపథ్యంలో విదేశాల నుంచి ఆక్సిజన్ ప్లాంట్స్‌ను తెప్పిస్తున్నారు. ప్రభుత్వాలకు ధీటుగా కోవిడ్ రోగులకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. అడిగిన వారికి క్షణాల్లో సాయం చేస్తూ ‘పిలిస్తే పలికే దేవుడు’ అనిపించుకుంటున్నారు సోనూ సూద్. ఆయన చేస్తున్న సాయంపై దేశం నలుమూలల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది.

Read More : MSP For Kharif Crops : ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు