Kaushik Reddy: రేవంత్‎ రెడ్డి, ముమైత్ ఖాన్ ఇద్దరూ ఒకటే..!

హుజూరాబాద్‌కు ఉపఎన్నిక హీట్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం వేడి పుట్టిస్తోంది.

Kaushik Reddy: రేవంత్‎ రెడ్డి, ముమైత్ ఖాన్ ఇద్దరూ ఒకటే..!

Huzur

Huzurabad Bypoll: హుజూరాబాద్‌కు ఉపఎన్నిక హీట్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం వేడి పుట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి 2018ఎన్నికల్లో పోటీచేసిన కౌశిక్ రెడ్డి రాజీనామా చెయ్యడంతో కాంగ్రెస్ వర్గాల్లో కూడా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కౌశిక్ రెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కొత్తగా టీపీసీసీ అధ్యక్షులైన రేవంత్ రెడ్డి కంటే ఉత్తమ్ రెడ్డి లక్ష రెట్లు నయమన్నారు. కార్యకర్తల్లో ధైర్యం నింపడంలో ఉత్తమ్ ఉత్తమమని, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాన్ని వదిలిపెట్టి రేవంత్ ఫొటోలు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా యాక్టర్‌లా రేవంత్ రెడ్డి ఫీల్ అవుతున్నారని, టీపీసీసీ చీఫ్ పదవి వస్తే ముఖ్యమంత్రి అయిపోయినట్లుగా భావిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడికి తెలంగాణ కాంగ్రెస్‌ను తాకట్టు పెట్టారని అన్నారు.

పొన్నం ప్రభాకర్.. నువ్వు మగాడివైతే, హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకో.. ఇన్ని రోజులు ఎగిరెగిరి పడ్డారు కదా? కాంగ్రెస్‌కు ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం. రేవంత్, పొన్నం ప్రభాకర్‌కు ఇదే నా సవాల్. కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించారు. ఆరు నెలల్లో మొత్తం ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. సినిమాలో ముమైత్ ఖాన్‌ వస్తే చప్పట్లు, ఈలలు కొడతారు. రేవంత్‎ రెడ్డి, ముమైత్ ఖాన్ ఇద్దరూ ఒకటే, సీఎం సీఎం అంటే సరిపోతుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.