అక్షర సేద్యం : సిరివెన్నెలకు పద్మశ్రీ

తెలుగు సినీ వనంలో పద కుసుమాలను పూయించి, సిరివెన్నెలను చిలికించిన ప్రముఖ గేయ రచయిత సిరిమెన్నెల సీతారామశాస్త్రిని ‘పద్మశ్రీ’ వరించింది. పదాలతో ప్రయోగాలు

  • Published By: veegamteam ,Published On : January 26, 2019 / 03:31 AM IST
అక్షర సేద్యం : సిరివెన్నెలకు పద్మశ్రీ

తెలుగు సినీ వనంలో పద కుసుమాలను పూయించి, సిరివెన్నెలను చిలికించిన ప్రముఖ గేయ రచయిత సిరిమెన్నెల సీతారామశాస్త్రిని ‘పద్మశ్రీ’ వరించింది. పదాలతో ప్రయోగాలు

తెలుగు సినీ వనంలో పద కుసుమాలను పూయించి, సిరివెన్నెలను చిలికించిన ప్రముఖ గేయ రచయిత సిరిమెన్నెల సీతారామశాస్త్రిని ‘పద్మశ్రీ’ వరించింది. పదాలతో ప్రయోగాలు చేయడం   ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య. తెలుగు సినిమా పాటల పూదోటలో  విరిసిన ఒకానొక పారిజాతపుష్పం. అక్షరాలనే కిరణాలు, పదాలనే తేజాలను సృష్టించాడు. తన పాటలతో అక్షర సేద్యం చేసే  కవి కర్షకుడు.

 

సరసం, శృంగారం, వేదన, ఆర్ద్రత, ఆలోచన… ఇలా కవిత్వానికి ఎన్ని ఒంపులు ఉన్నాయో, అక్షరంలో ఎన్ని అందాలు ఉన్నాయో తెలిసిన చిత్రకారుడు.. సిరివెన్నెల. ‘విధాత తలపున  ప్రభవించినదీ’ అంటూ ఏ క్షణాన ఆయన తెలుగు సినిమా పాట కోసం కలం పట్టుకున్నారో, అప్పుడే ఆయన తెలుగు పాటకు ముద్దు బిడ్డ అయిపోయారు. అప్పటి సినీ సంగీత ప్రయాణం  నిర్విరామంగా సాగుతూనే ఉంది. ఆయన పాటలతో ప్రశ్నించారు, జోల పాడారు, మేల్కొలిపారు. సంక్లిష్టమైన సన్నివేశానికి సైతం… అందమైన, అర్థవంతమైన పదాలతో, సామాన్యుడికి కూడా  అర్థమయ్యేలా సాహిత్యాన్ని అందించారు.

 

1955 మే 20న మధ్యప్రదేశ్‌లోని శివినిలో సీతారామశాస్త్రి జన్మించారు. చేంబోలు వేంకటయోగి, సుబ్బలక్ష్మి ఆయన తల్లిదండ్రులు. వారికి పెద్ద కుమారుడు. అనకాపల్లిలో హైస్కూల్లో చదివారు.  కాకినాడ ఆదర్శ జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో ఒక ఏడాది ఎంబీబీఎస్ చదివాక టెలిఫోన్స్‌ శాఖలో అసిస్టెంటుగా ఉద్యోగంలో చేరారు.  కాకినాడలో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఆంధ్రా వర్సిటీలో ఎంఏ చేశారు. అక్కడే పలువురు సాహితీవేత్తలతో ఆయనకి స్నేహం బలపడింది. భరణి అనే కలం పేరుతో పలు పత్రికల్లో కథలు, కవితలు  రాశారు. 1985లో కె.విశ్వనాథ్‌ ‘సిరివెన్నెల’ చిత్రంతో సీతారామశాస్త్రి గీత రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. అలా తొలి చిత్రం పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. 2019 ఏడాదికి గాను  కేంద్రం ఆయన్ని పద్మశ్రీతో గౌరవించడం తెలుగు సాహిత్యానికి దక్కిన గౌరవంగా భావింస్తున్నారు.

 

* స్వర్ణకమలం సినిమాలో ఓం నమో నమ: శివాయ అంటూ ఆయన రాసిన పదాలు ఓంకారనాదం లా మన చెవుల్లో ఇప్పటికీ ఝుమ్మంటునే ఉన్నాయి.
* అందెల రవళికి పదముల తానై అనే చరణానికి.. నాట్యానానికి , నటరాజ స్వామికి మధ్య బంధాన్ని తన కలంతో పండిత పామర జనరంజకంగా రాసి ఇటువంటి గీతాలలో తనకు తిరుగులేదని  పించుకున్నాడు.
* ‘భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ భర్తకు మారకు బ్యాచిలరు’ అని పాడుకేనే ఆధునిక బ్రహ్మచారుల శైలీని అద్ధం పట్టింది. కామెడీ పాటలను రాయడంలో తనకు సాటిరారని నిరూపించుకున్నాడు శాస్త్రీ.  * ‘జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది’..అంటూ ‘చక్రం’ సినిమాలో ఆయన రాసిన ఈ పాట ఆయనలోని తాత్వికుడ్ని మన ముందు ఆవిష్కరించింది. *  కవినై…కవితనై…భార్యనై…భర్తనై…అన్ని తానే అంటాడు. అందరు ఉన్న నా జీవితం ఒంటరి అన్నాడు ఈ పాటలో.. పాటను అర్థం అయ్యేలా రాయనక్కర్లేదు. అర్ధం చేసుకునే కోరిక పుట్టేలా రాసి  ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి శాస్త్రీ.