పహిల్వాన్ – జ్యూక్ బాక్స్

'కిచ్చా' సుదీప్, ఆకాంక్ష సింగ్ నటిస్తున్న పహిల్వాన్ ఆడియో ఆల్బమ్ రిలీజ్.. సెప్టెంబర్ 12న కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళ్, మళయాలం భాషల్లో పహిల్వాన్ గ్రాండ్‌గా రిలీజవనుంది..

10TV Telugu News

‘కిచ్చా’ సుదీప్, ఆకాంక్ష సింగ్ నటిస్తున్న పహిల్వాన్ ఆడియో ఆల్బమ్ రిలీజ్.. సెప్టెంబర్ 12న కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళ్, మళయాలం భాషల్లో పహిల్వాన్ గ్రాండ్‌గా రిలీజవనుంది..

అభినయ చక్రవర్తి.. ‘కిచ్చా’ సుదీప్ నటిస్తున్న కన్నడ సినిమా.. పహిల్వాన్.. ఆకాంక్ష సింగ్ హీరోయిన్.. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఎస్.కృష్ణ దర్శకత్వంలో, RRR మోషన్ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై స్వప్న కృష్ణ నిర్మించాడు. కిక్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన పహిల్వాన్ ట్రైలర్ అండ్ లిరికల్ సాంగ్స్‌కి మంచి స్పందన వచ్చింది. రీసెంట్‌గా పహిల్వాన్ జ్యూక్ బాక్స్ రిలీజ్ చేశారు. ఈ ఆల్బమ్‌‌లో మొత్తం ఏడు పాటలున్నాయి. అన్ని పాటలకూ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.

‘జైహో పహిల్వాన్’ సాంగ్‌తో ఆల్బమ్ స్టార్ట్ అవుతుంది. ఈ పాటను సాయి చరణ్ భాస్కరుని, సాకేత్ కోమండూరి కలిసి పాడారు. ‘యోధుడా’ పాటను విజయ్ ప్రకాష్, సిద్ధార్థ్ బాసూర్ పాడారు. ‘ఫైర్ బ్రాండూ’ సాంగ్ రేవంత్ పాడగా.. ‘ప్రేమ కాలం’ పాటను శ్రీ కృష్ణ, రమ్య బెహరా, రాహుల్ నంబియార్ పాడారు.

Read Also : గాన కోకిలకు ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన సల్లూ భాయ్..

అనురాగ్ కులకర్ణి ‘ధృవతార’, సంజిత్ హెగ్డే ‘కన్నెపిచ్చుక’, వ్యాస్ రాజ్ ‘వచ్చాడయ్యో పహిల్వాన్’ పాటలను పాడారు.  వీటితో పాటు ‘మాంగళ్య’, ‘స్టంట్ థీమ్స్’ కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 12న కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళ్, మళయాలం భాషల్లో పహిల్వాన్ గ్రాండ్‌గా రిలీజవనుంది.