PAKA Movie : 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లో ‘పాక’..

‘మల్లేశం’ సినిమా దర్శకుడు రాజ్ రాచకొండ.. బాలీవుడ్ నటుడు, దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో కలిసి నిర్మించిన ‘పాక’ చిత్రం టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లో ప్రదర్శితం కానుంది..

PAKA Movie : 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లో ‘పాక’..

Paka

PAKA Movie: తెలుగులో ప్రియదర్శి ప్రధాన పాత్రలో వచ్చిన ‘మల్లేశం’ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఆ సినిమాకి దర్శకత్వం వహించిన రాజ్ రాచకొండ ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో కలిసి ‘పాక – ది రివర్ అఫ్ బ్లడ్’ (The River of Blood) అనే మలయాళ చిత్రాన్ని నిర్మించారు. ‘మల్లేశం’ చిత్రానికి సౌండ్ డిజైనర్‌గా పనిచేసిన నితిన్ లుకోసి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లో ప్రదర్శనకు ఎన్నికయింది.

MAA Elections 2021 : ‘మా’ సభ్యులకు ప్రకాష్ రాజ్ విందు.. కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్..

ఈ సందర్బంగా నిర్మాత రాజ్ రాచకొండ మాట్లాడుతూ.. ‘‘మల్లేశం’ చిత్రానికి నా టీం చాలా సహాయం చేసింది. నా టీంతో ఒక చిత్రాన్ని నిర్మించాలి అని అనుకున్నాను. వాళ్ళు చేసిన నాలుగు కథలలో నాకు ‘పాక’ కథ బాగా నచ్చింది. ప్రేమ మరియు క్రూరత్వం గురించి భావోద్వేగాలను తెలియజెప్పే లోతైన కథ ఇది. రెండు గొడవపడే కుటుంబాలలోంచి పుట్టుకొచ్చిన ఒక ప్రేమ జంట కథే ‘పాక’.

ALA Amerikapurramullo : ‘ఆహా’ సమర్పణలో.. ‘అలా అమెరికాపురములో’

మా చిత్రాన్ని ఉత్తర కేరళలోని వయనాడ్‌లో చిత్రీకరించాం. బేసిల్ పౌలోస్, వినీత కోశాయ్, జోస్ కిజక్కన్, అత్తుల్ జాన్, నితిన్ జార్జ్ మరియు జోసెఫ్ మాణికల్ ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 13న 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లో ప్రదర్శింపబడుతోంది’’ అన్నారు.