Joyland : ఆస్కార్‌కు ఎంపిక అయిన చిత్రంపై నిషేధం..

జాయ్‌ల్యాండ్.. ఒక పాకిస్తానీ మూవీ. సైమ్ సాదిక్ తెరకెక్కించిన తొలి చిత్రం పాకిస్తాన్ లో సంచలనంగా మారింది. మనం ఎన్నో ప్రేమకథలు చూసి ఉంటాం కానీ ఈ ప్రేమకథ అంతకుమించి. 2023కి పాకిస్తాన్ నుంచి అధికారికంగా ఆస్కార్ బరిలోకి ప్రవేశించిన ఈ చిత్రం సొంతం దేశంలో మాత్రం విడుదలకు ఒక వారం ముందే నిషేధించబడింది. ఈ మూవీ ట్రైలర్ ఓపెనింగ్ లో వచ్చే డైలాగ్..

Joyland : ఆస్కార్‌కు ఎంపిక అయిన చిత్రంపై నిషేధం..

Pakistan Government Boycott Oscar Nomination Movie Joyland

Joyland : జాయ్‌ల్యాండ్.. ఒక పాకిస్తానీ మూవీ. సైమ్ సాదిక్ తెరకెక్కించిన తొలి చిత్రం పాకిస్తాన్ లో సంచలనంగా మారింది. మనం ఎన్నో ప్రేమకథలు చూసి ఉంటాం కానీ ఈ ప్రేమకథ అంతకుమించి. ఒక యువకుడు మరియు ట్రాన్స్‌జెండర్ మధ్య జరిగే ప్రేమకథే ఈ చిత్రం కథాంశం. 2023కి పాకిస్తాన్ నుంచి అధికారికంగా ఆస్కార్ బరిలోకి ప్రవేశించిన ఈ చిత్రం సొంతం దేశంలో మాత్రం విడుదలకు ఒక వారం ముందే నిషేధించబడింది.

RRR: “ఆర్ఆర్ఆర్” రికార్డులను బ్రేక్ చేసిన పాకిస్తాన్ మూవీ.. ఏంటి ఆ సినిమా?

ఈ మూవీ ట్రైలర్ ఓపెనింగ్ లో వచ్చే డైలాగ్.. “ఒక దోమ, కోడి ప్రేమలో పడ్డాయి. రెండు కిస్ చేసుకున్నాయి. అయితే ఆ తరువాత దోమకి బర్డ్ ఫ్లూ, కోడికి డెంగ్యూ వచ్చి చనిపోయాయి. అవి చనిపోడానికి కారణం ప్రేమే” అంటూ కథ ఏంటో చెప్పేశాడు దర్శకుడు. స్టేజి డాన్సర్ గా పని చేసే ట్రాన్స్‌జెండర్ పై, తన దగ్గర డాన్సర్ గా పని చేసే యువకుడు మనసు పారేసుకుంటాడు.

కానీ వారిద్దరి ప్రేమని సమాజం ఒప్పుకోకపోవడంతో, వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదురుకున్నారో అనేది మిగతా చిత్రం. అయితే పాకిస్తాన్ లో స్వలింగ సంబంధం చట్టరీత్య నేరం. దీంతో అక్కడి ప్రభుత్వం ఈ మూవీని బాయ్‌కాట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన తొలి పాకిస్తాన్ చిత్రంగా ‘జాయ్‌ల్యాండ్’ సినిమా చరిత్ర సృష్టించింది.