Mahira Khan : ఇండియన్ హీరోని అభిమానిస్తునందుకు.. పాకిస్తాన్ నటికి మానసిక రోగం ఉందంటున్న పాక్ డాక్టర్!

షారుఖ్ (Shah Rukh Khan) 'రయీస్' (Raees) సినిమాలో పాకిస్తానీ యాక్ట్రెస్ మహీరా ఖాన్‌ (Mahira Khan) నటించింది. ఇటీవల పాకిస్తాన్ లో జరిగిన ఒక ఆర్ట్స్ కౌన్సిల్‌లో మహిరా, షారుఖ్ ని ఆకాశానికి ఎత్తేసింది. దీనిపై పాకిస్తానీ సెనేటర్ స్పందిస్తూ.. మహిరాకి మానసిక సమస్యలు ఉంది అంటూ వ్యాఖ్యానించింది.

Mahira Khan : ఇండియన్ హీరోని అభిమానిస్తునందుకు.. పాకిస్తాన్ నటికి మానసిక రోగం ఉందంటున్న పాక్ డాక్టర్!

Pakistan Senator comments on Mahira Khan and shah rukh khan

Mahira Khan : దేశాలకు మధ్య కంచెలు ఉండవచ్చు, కానీ ఆ కంచెలు సినిమాకి అడ్డు రాదు. ఒక సినిమా బాగుంటే భాషతో, దేశంతో సంబంధం ఉండదు. ఇప్పటికే ఒక దేశంలోని నటులు, ఇంకో దేశ సినిమాల్లో నటిస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలోనే.. గతంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన ‘రయీస్’ (Raees) సినిమాలో పాకిస్తానీ యాక్ట్రెస్ మహీరా ఖాన్‌ (Mahira Khan) నటించింది. 2017లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఆ మూవీ షూటింగ్ లో మహీరా ఖాన్‌, షారుఖ్ వర్క్ చూసి అతడికి అభిమాని అయ్యిపోయింది.

Pathaan – Baahubali 2 : హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద బాహుబలి-2 రికార్డుని బ్రేక్ చేయడానికి.. బాలీవుడ్ స్టార్స్‌కి 5 ఏళ్ళు పట్టింది!

ఇటీవల పాకిస్తాన్ లో జరిగిన ఒక ఆర్ట్స్ కౌన్సిల్‌లో మహిరా ఖాన్‌.. రయీస్ షూటింగ్ సమయంలో షారుఖ్ తనతో ఎంత హుందాగా ప్రవర్తించాడనే దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడుతూ, షారుఖ్ ని ఆకాశానికి ఎత్తేసింది. దీని పై పాకిస్తాన్ కి చెందిన సెనేటర్ డాక్టర్ అఫ్నాన్ ఉల్లా ఖాన్ స్పందిస్తూ.. మహిరా ఖాన్‌ పై తీవ్ర విమర్శలు చేశారు. మహిరా డబ్బు కోసం భారతీయ నటులను మెప్పించడానికి ప్రయత్నిస్తుంది. ఆమెకు మానసిక సమస్యలు ఉన్నట్లు ఉన్నాయి అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Shah Rukh Khan : ఇది బిజినెస్ కాదు, పర్సనల్.. పఠాన్ పై షారుఖ్ ఎమోషనల్ ట్వీట్!

పాకిస్తానీ సెనేటర్ వ్యాఖ్యలను తప్పు పడుతూ ఇండియన్ ఆడియన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. తమ లైఫ్ లో ఒక స్టార్ తో కలిసి పని చేసే అదృష్టం కలిగినప్పుడు, ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకునే హక్కు ఆ ఆర్టిస్టులకు ఉంటుంది. అదే టామ్ క్రూజ్ లేదా టామ్ హాంక్స్‌ యాక్టర్స్ తో కలిసి పని చేసి. ఆ నటుడు గురించి గొప్పగా మాట్లాడితే.. దానిని కూడా మానసిక వ్యాధి అనే అంటారా? అని ప్రశ్నిస్తున్నారు.