Pakka Commercial : డబ్బుల కోసమే పని చేసే లాయర్.. పక్కా కమర్షియల్ ట్రైలర్ రిలీజ్..

ఇప్పటికే పక్కా కమర్షియల్ సినిమా నుంచి వచ్చిన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆదివారం నాడు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం కామెడీ, మాస్ సీన్స్ తో...................

Pakka Commercial : డబ్బుల కోసమే పని చేసే లాయర్.. పక్కా కమర్షియల్ ట్రైలర్ రిలీజ్..

Pakka Commercial

Pakka Commercial :  గోపీచంద్ త్వరలో పక్కా కమర్షియల్ సినిమాతో రానున్నాడు. ఇందులో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. మారుతి డైరెక్షన్ లో ఈ సినిమాని అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ బ్యానర్‌పై బ‌న్నీ వాసు నిర్మించారు. మారుతి సినిమాలంటే కామెడీ ఉంటుందని తెలిసిందే. ఈ సినిమాలో కూడా కామెడీతో పటు ఫుల్ మాస్ యాక్షన్స్ సీక్వెన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే పక్కా కమర్షియల్ సినిమా నుంచి వచ్చిన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆదివారం నాడు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం కామెడీ, మాస్ సీన్స్ తో అలరించింది. ఇందులో హీరో, హీరోయిన్, హీరో తండ్రి లాయర్లుగా కనిపించనున్నారు. ట్రైలర్ ప్రారంభంలోనే నేను హీరో అనుకున్నారా కాదు విలన్ అంటూ గోపీచంద్ తన స్టైల్ లో మొదలుపెట్టాడు. హీరో డబ్బులు తీసుకుంటూ డబ్బుల కోసం పని చేస్తూ తప్పులు చేసిన వాళ్ళని కూడా రక్షిస్తూ ఉంటాడు. అలాగే రాశీఖన్నా హీరో దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయినట్టు, వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డట్టు, రావు రమేష్ విలన్ లా చూపించారు.

Nayan-Vignesh : నయనతార-విగ్నేష్ శివన్ రిసెప్షన్ ఫోటోలు

హీరో తప్పు చేసిన వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని గెలిపిస్తూ ఉండటం, ఏదో పెద్ద కేసులో వాళ్ళ నాన్నకి, ఇతనికి మధ్య గొడవ రావడం, చివర్లో కొన్ని యాక్షన్ సీన్స్ చూపించారు. ట్రైలర్ తోటే సినిమాపై అంచనాలు పెంచారు. ఇటీవలే సీటిమార్ సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్ మరోసారి ఈ సినిమాతో కూడా హిట్ కొడతాడు అనే తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో గోపీచంద్ మరింత అందంగా కనిపించాడు. జులై 1న ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది.