మోహన్రావొచ్చినాడు.. వాసుగోడి పీక తీసుకెళ్లిపోనాడు..

‘పలాస 1978’ థియేట్రికల్ ట్రైలర్ రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు..

  • Published By: sekhar ,Published On : March 1, 2020 / 12:43 PM IST
మోహన్రావొచ్చినాడు.. వాసుగోడి పీక తీసుకెళ్లిపోనాడు..

‘పలాస 1978’ థియేట్రికల్ ట్రైలర్ రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు..

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’. తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

‘పలాస 1978’ సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదలవుతోంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రోత్సాహం అందించడంలో రానా ఎప్పుడూ ముందుంటారు.. ‘పలాస 1978’ ట్రైలర్‌ని ట్విట్టర్‌లో లాంచ్ చేసిన రానా టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. 

‘కేరాఫ్ కంచరపాలెం’ లాంటి విభిన్నమైన సినిమాను ప్రమోట్ చేసిన రానా “పలాస 1978” ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యారు. విజువల్స్, నేపథ్యం చాలా కొత్తగా ఉన్నయని రానా అన్నారు.. మార్చి 6న సినిమా భారీగా విడుదల కానుంది. ఈ చిత్రానికి  పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచె, కో ప్రొడ్యూసర్ : మీడియా 9 మనోజ్, నిర్మాత : ధ్యాన్ అట్లూరి, రచన-దర్శకత్వం : కరుణ కుమార్.