Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు కిక్కిచ్చిన పాన్ ఇండియా డైరెక్టర్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ఈవెంట్ కి పెద్ద పెద్ద గెస్ట్ లు ఎవరూ లేరని చెప్పిన టీమ్.. పాన్ ఇండియా డైరెక్టర్లనే సెంటర్ ఆఫ్ ద ఎట్రాక్షన్ చేశారు. ప్రభాస్ ప్రజెంట్ చేస్తున్న..

Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు కిక్కిచ్చిన పాన్ ఇండియా డైరెక్టర్స్!

Radhe Shyam (1)

Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ఈవెంట్ కి పెద్ద పెద్ద గెస్ట్ లు ఎవరూ లేరని చెప్పిన టీమ్.. పాన్ ఇండియా డైరెక్టర్లనే సెంటర్ ఆఫ్ ద ఎట్రాక్షన్ చేశారు. ప్రభాస్ ప్రజెంట్ చేస్తున్న సినిమాల డైరెక్టర్లందరినీ పిలిచి ట్రెండ్ క్రియేట్ చేశాడు. అసలు ఏమాత్రం ఒకదానికొకటి సంబంధం లేకుండా ప్రస్తుతం ప్రభాస్ తో సినిమాలు చేస్తున్న డైరెక్టర్లు ఈ పాన్ ఇండియా స్టార్ గురించి ఆకాశానికి ఎత్తేశారు. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

Akshay Kumar: టార్గెట్ 2 వేల కోట్లు.. వచ్చే ఏడాది అక్కీ ప్లానింగ్ అదిరిపోద్ది!

స్పెషల్ గెస్ట్ లు ఎవరూ లేరని చెప్పిన ఈ ఈవెంట్ కి.. తను చేస్తున్న సినిమాల డైరెక్టర్లే ఈవెంట్ కి స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. స్పెషల్లీ తమ హీరో ప్రభాస్ గురించి మాట్లాడి ఫాన్స్ లో జోష్ నింపారు. రాధేశ్యామ్ సినిమా తియ్యడానికి నాలుగేళ్లు పట్టిందన్న రాధాకృష్ణ .. ప్రభాస్ లాంటి ప్రెండ్, గురువు అందరికీ ఉండాలంటూ తెగ పొగిడేశాడు. తక్కువ సినిమాలు చేసి తెలుగు ఆడియన్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన డైరెక్టర్ నాగశ్విన్ కూడా స్టేజ్ మీద ఫన్ క్రియేట్ చేశారు. ప్రజెంట్ ప్రభాస్, దీపికా పదుకోన్ జంటగా సైన్స్ ఫిక్షన్ డ్రామా ప్రాజెక్ట్ కె సినిమా చేస్తున్నారు నాగాశ్విన్.

RRR: సల్మాన్‌తో కలిసి ‘నాటు’ స్టెప్పులేసిన తారక్-చరణ్!

ఈ స్టార్ డైరెక్టర్ కూడా.. ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల గురించి, పాన్ ఇండియా ఇమేజ్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ డైరెక్టర్ అయినా.. తెలుగు ఆడియన్స్ కి ఇప్పటి వరకూ పెద్దగా పరిచయం లేని పేరు. కానీ ప్రభాస్ తో సినిమా అనౌన్స్ చేసి ఆల్ ఇండియా ప్రభాస్ ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు ఓమ్ రౌత్. అంతేకాదు.. ఈవెంట్ లో తెలుగులో డైలాగ్స్ చెప్పి.. డార్లింగ్ ని ఇంకా ఇంప్రెస్ చేశాడు ఈ డైరెక్టర్. అంతేకాదు.. ఈ వెంట్ కి అటెండ్ అయిన ఆడియన్స్ కి ఫుల్ జోష్ తెప్పించారు ఓమ్ రౌత్.

Rajinikanth: అన్నాత్తై టీమ్ సభ్యులకు సూపర్ స్టార్ గోల్డ్ చైన్స్ గిఫ్ట్!

ఇంత మంది స్టార్ డైరెక్టర్లు ప్రభాస్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నా.. తెలుగులో ఇంకా రెండు సినిమాలు కూడా చెయ్యని సందీప్ రెడ్డికి తన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ అయిన 25వ సినిమా స్పిరిట్ కు ఛాన్సిచ్చారు ప్రభాస్. ఈ క్రేజ్ ని, ఇమేజ్ ని ఏమాత్రం తగ్గించనని ఇది మాత్రం రాసిపెట్టుకోండని స్పిరిట్ సినిమా మీద అంచనాలు పెంచేశారు.