Kabzaa : కన్నడ రేంజ్ ని పెంచడానికి వస్తున్న మరో పాన్ ఇండియా సినిమా..

కేజీఎఫ్ తర్వాత చార్లీ 777, విక్రాంత్ రోనా, కాంతారా లాంటి సినిమాలు జాతీయ స్థాయిలో ప్రభావం చూపించాయి. ఈ క్రమంలో కన్నడ నుంచి "కబ్జా" అనే మరో పాన్ ఇండియా మూవీ రాబోతోంది. కన్నడ అగ్ర హీరోలు.................

Kabzaa : కన్నడ రేంజ్ ని పెంచడానికి వస్తున్న మరో పాన్ ఇండియా సినిమా..

pan india movie Kabzaa coming soon from kannada industry

Kabzaa :  ‘కేజీఎఫ్’ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు కన్నడ సినిమా రేంజ్ ను ఓ రేంజ్ లో పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మిగతా హీరోలు, ఫిలిం మేకర్స్ కు పాన్ ఇండియా సినిమాలు చేయగలమనే ధైర్యాన్నిచ్చాయి ఆ సినిమాలు. ఈ నేపధ్యంలో వచ్చిన మరికొన్ని కన్నడ సినిమాలు కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. టాలీవుడ్, బాలీవుడ్ లో సైతం రికార్డ్ వసూళ్ళు రాబట్టాయి.

కేజీఎఫ్ తర్వాత చార్లీ 777, విక్రాంత్ రోనా, కాంతారా లాంటి సినిమాలు జాతీయ స్థాయిలో ప్రభావం చూపించాయి. ఈ క్రమంలో కన్నడ నుంచి “కబ్జా” అనే మరో పాన్ ఇండియా మూవీ రాబోతోంది. కన్నడ అగ్ర హీరోలు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ తొలిసారిగా కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఇది. ఇందులో శ్రియా శరణ్, మనోజ్ బాజ్ పాయ్ లాంటి మరికొందరు స్టార్స్ భాగమయ్యారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ని కూడా రిలిజ్ చేశారు. తాజాగా హిందీలోనూ రిలీజ్ చేయబోతున్నామంటూ హిందీ టీజర్ రిలీజ్ చేశారు.

Manchu vishnu : జూబ్లీహిల్స్ ట్రాఫిక్ డైవర్షన్ పై మంచు విష్ణు ట్వీట్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు..

స్వాతంత్య్రానికి ముందు ఉన్న ఓ పెద్ద గ్యాంగ్ స్టర్ గురించి ఈ సినిమా. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాని ఆర్.చంద్రశేఖర్, అలంకార్ పాండ్యన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్.చంద్రు డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమాకి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ‘కేజీఎఫ్’ తరహా క్రైమ్ ఎలిమెంట్స్ తో ‘కబ్జా’ ఈ నెల 22న పాన్ ఇండియా రేంజ్ లో ఆడియన్స్ ను థ్రిల్ చేయబోతోంది. మరి ఈ కన్నడ సినిమా దేశవ్యాప్తంగా ఇంకే రేంజ్ లో మ్యాజిక్ చేయబోతుందో చూడాలి.