Nagarjun: 30 ఏళ్ల క్రితమే నాగ్‌తో పాన్ ఇండియా సినిమా ప్లాన్!

ఇప్పుడు మన ఫిల్మ్ మేకర్స్ అంతా పాన్ ఇండియా సినిమా బాట పట్టిన సంగతి తెలిసిందే. చోటా హీరోల నుండి బడా స్టార్స్ వరకు ఇప్పుడంతా పాన్ ఇండియా జమానా. అయితే.. అసలు ఎవరూ ఊహించని రేంజిలో ముప్పై ఏళ్ల క్రితమే నాగార్జున హీరోగా భారీ బడ్జెట్ తో ఓ పాన్ ఇండియా సినిమాకు సన్నాహాలు జరిగాయట.

Nagarjun: 30 ఏళ్ల క్రితమే నాగ్‌తో పాన్ ఇండియా సినిమా ప్లాన్!

Nagarjun

Nagarjun: ఇప్పుడు మన ఫిల్మ్ మేకర్స్ అంతా పాన్ ఇండియా సినిమా బాట పట్టిన సంగతి తెలిసిందే. చోటా హీరోల నుండి బడా స్టార్స్ వరకు ఇప్పుడంతా పాన్ ఇండియా జమానా. ఇప్పటికే మన తెలుగు హీరోలతో ఈ బాటలో అరడజనుకు పైగా సినిమాలు తెరకెక్కుతుండగా ఇకపై కూడా ఇదే పంథా కొనసాగే పరిస్థితి కనబడుతుంది. అయితే.. అసలు ఎవరూ ఊహించని రేంజిలో ముప్పై ఏళ్ల క్రితమే నాగార్జున హీరోగా భారీ బడ్జెట్ తో ఓ పాన్ ఇండియా సినిమాకు సన్నాహాలు జరిగాయట.

కథ, కథనం, నటీనటుల ఎంపికతో పాటు టెక్నీషియన్స్ అందరూ సిద్దమవగా మరో వారం రోజులలో షూటింగ్ మొదలుకానుంది అనుకున్న సమయంలో ఈ సినిమా ఆగిపోయిందట. ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్‌రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కింగ్ నాగార్జున 90ల్లో వరసపెట్టి హిందీ సినిమాలలో నటించాడు. ఆ సమయంలో అన్ని భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా సినిమాకు ప్లాన్ చేశారు. అయితే, చివరికి కథలో మార్పుల దగ్గర దర్శక, నిర్మాతల మధ్య అభిప్రాయం బేధాలతో ఈ సినిమా ఆగిపోయిందట.

సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్‌రెడ్డి అప్పట్లో ‘దుర్గా ఆర్ట్స్’ బేనర్ మీద కె.ఎల్.నారాయణతో కలిసి సినిమాలు నిర్మించేవారు. అలానే భారీ బడ్జెట్ తో నాగార్జునతో ఒక పాన్ ఇండియా చేయాలనుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్‌ అశోక్‌ మెహతా 48 గంటల వ్యవధిలో ముగిసిపోయే కథగా ఓ స్ర్కిప్టు రాశారు. రేసీ స్క్రీన్ ప్లేతో నడిచే ఈ కథలో తనకి విషం ఎక్కించిన ముగ్గురు విలన్లని హీరో చంపాలి. ఒక్కో విలన్‌ ఒక్కో రాష్ట్రంలో ఉండగా వారిని అన్వేషించే మార్గంలో హీరో ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ ఉంటాయి.

ఇందులో నాగ్ జోడిగా డింపుల్‌ కపాడియా, అనుపమ్‌ ఖేర్‌ లను హీరోయిన్స్ గా ఎంపిక కూడా చేసుకున్నారు. అయితే, మరో వారంలో సినిమా ప్రారంభం కావాల్సి ఉండగా నిర్మాతలైన కె.ఎల్‌.నారాయణ, నాగార్జున సోదరుడు వెంకట్‌ కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేస్తే బాగుంటుందని అశోక్‌ మెహతాకు చెప్పారట. కానీ ఆయన అందుకు ససేమిరా అనడంతో ఆ సినిమా అక్కడితో ఆగిపోయిందట. లేకపోతే అప్పట్లోనే మన ఇండస్ట్రీ నుండి ఓ భారీ పాన్ ఇండియా సినిమా ఇండియన్ స్క్రీన్ మీద రికార్డుగా నిలిచేది. అన్నట్లు అటు ప్రొడక్షన్, ఇటు కెమెరాకు కూడా చాలా ఏళ్లుగా దూరంగా ఉన్న గోపాల్ రెడ్డి.. మహేష్ బాబు-రాజమౌళి సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.