త్రిష బర్త్‌డే గిఫ్ట్ మూవీ : రాజకీయాలంటే పాముతో చెలగాటమే

త్రిష బర్త్‌డే సందర్భంగా పరమపదమ్ విళయాట్టు ట్రైలర్‌ రిలీజ్ ..

  • Published By: sekhar ,Published On : May 4, 2019 / 07:32 AM IST
త్రిష బర్త్‌డే గిఫ్ట్ మూవీ : రాజకీయాలంటే పాముతో చెలగాటమే

త్రిష బర్త్‌డే సందర్భంగా పరమపదమ్ విళయాట్టు ట్రైలర్‌ రిలీజ్ ..

గత పదిహేనుళ్ళుగా వెండితెరపై కథానాయికగా సత్తా చాటుతుంది చెన్నై పొన్ను త్రిష. గతేడాది కోలీవుడ్‌లో96 మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న త్రిష, ప్రస్తుతం తమిళ్‌లో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తుంది. ఆ సినిమా పేరు ‘పరమపదమ్ విళయాట్టు’.. ఇది త్రిష నటిస్తున్న 60వ సినిమా కావడం విశేషం. మే 4న త్రిష బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ని మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా రిలీజ్ చేయించింది మూవీ యూనిట్.

ట్రైలర్ మొత్తం త్రిష చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాలో త్రిష డాక్టర్‌గా, ఒక పాపకు తల్లిగా నటించింది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న పరమపదమ్ విళయాట్టు చిత్రాన్ని, అనుకోని పరిస్థితుల్లో తన కూతురితో సహా కిడ్నాప్‌కి గురై, ఒక రాత్రంతా అడవిలో రౌడీల దగ్గర బందీగా ఉన్న డాక్టర్, వాళ్ళ దగ్గరినుండి ఎలా తప్పించుకుంది, అసలామె ఎందుకు కిడ్నాప్‌కి గురైంది? అనే సస్పెన్స్‌తో, ఊహించని మలుపులతో రూపొందించినట్టు తెలుస్తుంది.

బేబి మనస్వి, నందా, రిచర్డ్, వేల రామ్మూర్తి, అజగప్పన్, చామ్స్, సోనా తదితరులు నటించిన ఈ మూవీకి కెమెరా : జె.దినేష్, ఎడిటింగ్ : ప్రదీప్ ఈ రాఘవ్, సంగీతం : అమ్రీష్, నిర్మాణం : 24 HRS ప్రొడక్షన్స్, రచన, దర్శకత్వం : కె.తిరుజ్ఞానమ్.

వాచ్ టీజర్..