Bollywood Sequels: పార్టుల మీద పార్టులు.. బాలీవుడ్‌లో సీక్వెల్స్ హవా!

వరుసగా సీక్వెల్స్ ను పట్టాలెక్కేంచిస్తున్నారు బాలీవుడ్ స్టార్స్. అచ్చొచ్చిన సినిమా కాబట్టి ఆలోచించకుండా సెకండ్ పార్ట్ కోసం రంగంలోకి దిగుతున్నారు. ఫస్ట్ పార్ట్ కంటే అదిరిపోయేలా..

Bollywood Sequels: పార్టుల మీద పార్టులు.. బాలీవుడ్‌లో సీక్వెల్స్ హవా!

Bollywood Sequels

Bollywood Sequels: వరుసగా సీక్వెల్స్ ను పట్టాలెక్కేంచిస్తున్నారు బాలీవుడ్ స్టార్స్. అచ్చొచ్చిన సినిమా కాబట్టి ఆలోచించకుండా సెకండ్ పార్ట్ కోసం రంగంలోకి దిగుతున్నారు. ఫస్ట్ పార్ట్ కంటే అదిరిపోయేలా కథను సిద్ధం చేసామంటూ ఆడియెన్స్ లో హైప్ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గా సల్మాన్ మళ్లీ ఓ సూపర్ హిట్ సీక్వెల్ ప్రకటించడంతో బాలీవుడ్ లో ఇప్పుడు సీక్వెల్స్ చర్చ షురూ అయింది.

Hollywood Movies: ఇండియాలో హాలీవుడ్ హవా.. బాక్సాఫీస్ వద్ద భళా!

బాలీవుడ్ లో సీక్వెల్ హవా ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. సీనియర్ స్టార్స్ తో పాటూ యంగ్ హీరోలు సైతం పార్ట్ పార్ట్ లుగా సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బ్లాక్ బస్టర్ భజరంగీ భాయిజాన్ సినిమాకు సీక్వెల్ చేయబోతున్నానని రీసెంట్ గా ప్రకటించాడు సల్మాన్ ఖాన్. ముంబైలో జరిగిన ట్రిపుల్ ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సల్మాన్.. రాజమౌళి ఫాదర్ భజరంగీ భాయిజాన్ సీక్వెల్ స్టోరీని రెడీ చేస్తున్నారని కన్ఫర్మ్ చేసాడు.

Hema Malini: రోడ్లను హీరోయిన్ల బుగ్గలతో పోల్చడం.. హేమమాలిని కామెంట్స్!

సీక్వెల్స్ చేయడం కొత్తేం కాదు బాలీవుడ్ కండల వీరుడికి. దబాంగ్ ఫ్రాంచైజ్ లో 3 సినిమాలు తీసుకొచ్చిన సల్మాన్ ప్రెజెంట్ టైగర్ 3లో నటిస్తున్నాడు. ఏక్తా టైగర్, టైగర్ జిందా హై హిట్స్ తర్వాత టైగర్ ఫ్రాంజైజ్ లో వస్తోన్న మూడో మూవీపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. టైగర్ మూడు ప్రాజెక్ట్స్ లోనూ హీరోయిన్ కత్రినా కైఫ్. ఇక టైగర్ 3లో విలన్ గా ఇమ్రాన్ హష్మీ కనిపించబోతున్నాడు. అటు చాన్నాళ్ల క్రితం వచ్చిన నో ఎంట్రీ మూవీకి సైతం సీక్వెల్ సన్నాహాలు జరుగుతున్నాయి. సల్మాన్ తో పాటూ నో ఎంట్రీ హీరోలందరూ ట్రిపుల్ రోల్ చేస్తారనీ బాలీవుడ్ టాక్.

Samantha Special Song: బాబోయ్.. సెక్సీగా కనిపించడం అంత ఈజీ కాదు!

స్టోరీ లైన్ నచ్చితే సీక్వెల్స్ కి సై అంటున్నాడు ఖిలాడీ అక్షయ్ కుమార్. ప్రస్తుతం ఒకేసారి 8కి పైగా సినిమాలు చేస్తోన్న అక్షయ్.. ఓ మై గాడ్ సీక్వెల్ లోనూ నటిస్తున్నాడు. కృష్ణుడి అవతారంగా ఓ మై గాడ్ లో నటించి సూపర్ హిట్ కొట్టిన ఖిలాడీ.. ఈసారి శివుడిగా మారిపోయాడు. ఓ మై గాడ్ 2 సీక్వెల్ లో అక్షయ్ శివుడిగా తన భక్తుడి ఇంటికి రాబోతున్నాడు. ఇక గతంలో ఈ హీరో హౌస్ ఫుల్ ఫ్రాంచైజ్ లో నాలుగు సినిమాలు చేసి నిజంగానే హౌస్ ఫుల్ కలెక్షన్స్ రాబట్టాడు.

Alia Bhatt: అందం, అభినయం కలిసిన రూపం ఈ భట్ బ్యూటీ!

సూపర్ హీరో ఫార్మెట్ లో మరోసారి అట్రాక్ట్ చేయబోతున్నాడు హృతిక్ రోషన్. కోయి మిల్ గయా తర్వాత ఆ మూవీకి సీక్వెల్స్ క్రిష్, క్రిష్ 3 సినిమాలు రిలీజై బంపర్ హిట్ కొట్టాయి. సినిమా సినిమాకు హీరోయిన్స్ ను మార్చుకుంటూ వస్తున్నాడు క్రిష్. ఈ ఫ్రాంచైజ్ లో ప్రీతి జింటా, ప్రియాంక చోప్రా హీరోయిన్స్ గా నటించగా కంగనా రనౌత్ సూపర్ విలన్ గా కనిపించింది. అంతకుమించి అన్న లెవెల్ లో క్రిష్ 4 రాబోతున్నట్టు ఇదివరకే హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ అనౌన్స్ చేసాడు. కాగా క్రిష్ 4లో హీరో, విలన్.. రెండు రోల్స్ లోనూ హృతికే భీభత్సం సృష్టించబోతున్నాడు. సేమ్ ప్రియా మెహ్రాగా ప్రియాంక చోప్రా కనిపిస్తుంది. కాకపోతే కాస్త టైం పడుతుంది క్రిష్ 4 బయటికి రావడానికి.

RRR-Radhe Shyam: సంక్రాంతి సినిమాలు.. ఫుల్‌గా ఆర్ఆర్ఆర్.. డల్‌గా రాధేశ్యామ్!

ఇప్పటివరకు సీక్వెల్స్ చేయలేదు కానీ.. లాంచ్ చేయడమే బ్రహ్మాస్త్రను మూడు భాగాలుగా చేసాడు రణ్ బీర్ కపూర్. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ తో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న బ్రహ్మాస్త్ర 3 పార్ట్స్ గా రాబోతుంది. రియల్ లైఫ్ లవ్ కపుల్ రణ్ బీర్, అలియా జంటగా నటిస్తున్నారు. అమితాబ్, అక్కినేని నాగార్జున, డింపుల్ కపాడియా వంటి స్టార్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. సూపర్ హీరో తరహాలో రణ్ బీర్ కనిపించబోతున్న బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్ట్ – శివ.. 2022 సెప్టెంబర్ 9న రాబోతుంది. ఇక ఈ మూవీకి కోపరేట్ చేసిన దర్శకధీర రాజమౌళి.. ఈ ఫ్రాంచైజ్ ను సౌత్ లో రిలీజ్ చేయబోతున్నారు.

Unstoppable with NBK: బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్.. స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ ఎపిసోడ్స్!

బీటౌన్ యంగ్ హీరోల్లో ఫ్రాంచైజ్ క్రేజ్ ఎక్కువ చూపించే స్టార్ టైగర్ ష్రాఫ్. భాగీ పేరుతో ఇప్పటికే మూడు సినిమాలు తీసుకొచ్చిన టైగర్ రిసెంట్ గా భాగీ 4ను అనౌన్స్ చేసాడు. అలాగే తనను హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన హీరోపంతి మూవీకి సీక్వెల్ గా హీరోపంతి2ను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అటు గణపత్ పేరుతో పెద్ద ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసిన టైగర్.. దీనిని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ముందే చెప్పేసాడు. హీరోపంతి 2తో పాటూ గణపత్ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాదే ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి.

Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఓటీటీలోకి పండగ తర్వాతే!

కొన్ని హిట్ ఇచ్చిన సినిమా సీక్వెల్స్ లో మళ్లీ ఆ హీరోలు కనపించకుండా.. కొత్త హీరోలను చూపిస్తున్నారు. ఇప్పుడలాగే దోస్తానా 2, బదాయి దో, భూల్ భులయ్యా లాంటి సీక్వెల్స్ ఉన్నాయి. అక్షయ్ కుమార్ నటించిన భూల్ భులయ్యా సీక్వెల్ ను కార్తీక్ ఆర్యన్ లీడ్ చేస్తున్నాడు. అటు గతంలో అబిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం బ్రొమాన్స్ చూపించిన దోస్తాన సీక్వెల్ లో మొదట కార్తీక్ ఆర్యన్, లక్ష్య్ లల్వాలని అనుకున్నారు. కానీ కరణ్ తో తేడా కొట్టిందో ఏమో.. దోస్తానా 2 నుంచి కార్తీక్ ను తప్పించి ఆ ప్లేస్ లో వేరే హీరోను సెట్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ దోస్తానా 2 హీరోయిన్. ఇక గతంలో ఆయుష్మాన్ ఖురానా చేసిన బదాయి హో సినిమా సీక్వెల్ బదాయి దోలో రాజ్ కుమార్ రావ్ నటిస్తున్నాడు. ఇది స్పిరిచివుల్ కాన్సెప్ట్ తో రాబోతుంది.