Pathaan : 3 రోజుల్లో 300 కోట్లు కొల్లగొట్టిన పఠాన్.. 2 రోజుల హాలిడేస్‌లో 500 కోట్ల మార్క్ అందుకుంటాడా?

కింగ్ కాంగ్ షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రం బాలీవుడ్ కి మళ్ళీ పూర్వ వైభవం తీసుకు వస్తుంది. బాలీవుడ్ లో ఏ సినిమా ఎదురుకొని స్థాయిలో ఈ మూవీ తీవ్ర వ్యతిరేకత ఎదురుకుంది. అయినా సరే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ చూడడమే కాదు, అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా అందుకుంటుంది.

Pathaan : కింగ్ కాంగ్ షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం బాలీవుడ్ కి మళ్ళీ పూర్వ వైభవం తీసుకు వస్తుంది. బాలీవుడ్ లో ఏ సినిమా ఎదురుకొని స్థాయిలో ఈ మూవీ తీవ్ర వ్యతిరేకత ఎదురుకుంది. సినిమాని విడుదల చేయవద్దు అంటూ కొందరు సామజిక కార్యకర్తలు థియేటర్ల ఓనర్ లకి వార్నింగ్ లు సైతం ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా బాయ్‌కాట్ పఠాన్ అంటూ ట్రెండ్ చేశారు. అయినా సరే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ చూడడమే కాదు, అదే రేంజ్ లో కలెక్షన్స్ కూడా అందుకుంటుంది.

Pathaan : ఆ రెండు రికార్డులని మాత్రం పఠాన్ కొట్టలేకపోయింది.. బాహుబలి, RRR తర్వాతే పఠాన్..

జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చితం.. శుక్రవారం నాటికి వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.300 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి బాద్‌షా స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ కి మరోసారి చూపించింది. దీనిబట్టి చూస్తే ఈ చిత్రం నెట్ షేర్ కలెక్షన్స్ సుమారు రూ.150 కోట్ల పైనే వచ్చినట్లు తెలుస్తుంది. హిందీ బెల్ట్ లో కేజీఎఫ్-2 మూడు రోజులకు గాను రూ.140.50 కోట్ల షేర్ సంపాదించింది. ఇప్పుడు పఠాన్ రూ.150 కలెక్షన్స్ సాధించి కేజీఎఫ్-2 రికార్డు ని బద్దలుకొట్టింది. కాగా ఇంకో రెండు రోజులు.. శనివారం, ఆదివారం వెకెండ్ హాలిడేస్ ఉన్నాయి.

ఇదే రేంజ్ లో పఠాన్ కలెక్షన్స్ రాబడితే ఈ రెండు రోజుల హాలిడేస్‌లో 200 కోట్ల రాబట్టడంలో సందేహం లేదు అంటున్నారు సినిమా పండితులు. మరి సండే టైంకి ఈ చిత్రం 500 కోట్ల మార్క్ అందుకుంటుందా? లేదా? అనేది చూడాలి. కాగా ఈ సినిమాలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటించింది. జాన్ అబ్రహం విలన్ పాత్ర పోషించాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించాడు. సిద్దార్ధ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. 250 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ట్రెండింగ్ వార్తలు