Siddharth Anand : బాయ్‌కాట్ పఠాన్ అన్నవాళ్ళు కూడా ఏదో ఒక థియేటర్ లో సినిమా చూస్తూ ఉంటారు..

ఇప్పటికే ఈ బాయ్‌కాట్ ట్రెండ్ పై ఇన్నాళ్లు స్పందించని షారుఖ్ పఠాన్ విజయం తర్వాత స్పందించాడు. తాజాగా పఠాన్ సినిమా డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ బాయ్‌కాట్ ట్రెండ్ పై, బాయ్‌కాట్ చేసేవాళ్లపై స్పందించాడు. పఠాన్ సక్సెస్ తర్వాత పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సిద్దార్థ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిద్దార్థ్ ఆనంద్ మాట్లాడుతూ..............

Siddharth Anand : బాయ్‌కాట్ పఠాన్ అన్నవాళ్ళు కూడా ఏదో ఒక థియేటర్ లో సినిమా చూస్తూ ఉంటారు..

Pathaan Director Siddharth Anand reacts on Boycott Trend

Siddharth Anand :  బాలీవుడ్ లో బాయ్‌కాట్ పదం ఏ రేంజ్ లో రచ్చ చేసిందో అందరికి తెలిసిందే. దాదాపు ఒక గత సంవత్సర కాలంగా బాలీవుడ్ ని, వాళ్ళ సినిమాలని, బాలీవుడ్ నటుల్ని సోషల్ మీడియాలో బాయ్‌కాట్ అంటూ ట్రెండ్ చేశారు. బాలీవుడ్ సినిమాలకి అసలే హిట్స్ లేక బాధపడుతుంటే ఈ బాయ్‌కాట్ ట్రెండ్ వాళ్ళకి పుండు మీద కారం చల్లినట్టైంది. కొంతమంది నటులు ఈ బాయ్‌కాట్ ట్రెండ్ పై సీరియస్ అవ్వగా, కొంతమంది లైట్ తీసుకున్నారు. కొంతమంది తమ సినిమాకి ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో అని బాయ్‌కాట్ ట్రెండ్ కి కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు.

కానీ మొత్తానికి 2023లో పఠాన్ సినిమాతో బాలీవుడ్ కి పెద్ద విజయం వచ్చింది. వారం రోజుల్లోనే పఠాన్ సినిమా 696 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి పలు రికార్డులని సెట్ చేసింది. పఠాన్ విజయంతో బాలీవుడ్ అంతా మళ్ళీ ఒక్కటయ్యి పఠాన్ ని ఇంకా పెద్ద హిట్ చేయాలని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. పఠాన్ సినిమా రిలీజ్ కి ముందు కూడా బాయ్‌కాట్ పఠాన్, బాయ్‌కాట్ బాలీవుడ్, బాయ్‌కాట్ షారుఖ్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. కానీ ఈ సినిమా విజయం సాధించడంతో బాలీవుడ్ లోని కొంతమంది ఇప్పుడు బాయ్‌కాట్ చేసేవాళ్లపై ధైర్యంగా మాట్లాడుతున్నారు.

Vijay : దసరాకే లియో.. చాలా సంవత్సరాల తర్వాత ఒకే ఇయర్ లో రెండు సినిమాలు..

ఇప్పటికే ఈ బాయ్‌కాట్ ట్రెండ్ పై ఇన్నాళ్లు స్పందించని షారుఖ్ పఠాన్ విజయం తర్వాత స్పందించాడు. తాజాగా పఠాన్ సినిమా డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ బాయ్‌కాట్ ట్రెండ్ పై, బాయ్‌కాట్ చేసేవాళ్లపై స్పందించాడు. పఠాన్ సక్సెస్ తర్వాత పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సిద్దార్థ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిద్దార్థ్ ఆనంద్ మాట్లాడుతూ.. అందరూ వచ్చి సినిమా చూడండి అని చెప్తాము. రావడం అనేది వాళ్ళ ఇష్టం. ఈ సినిమా మీద మాకు నమ్మకం ఉంది. ఈ సినిమాకి అందరూ వచ్చి చూడాలని మేము కోరుకున్నాం. వాళ్ళు కూడా వచ్చారు, సినిమా చూశారు. బాయ్‌కాట్ చేసేవాళ్ళు కూడా ఏదో ఒక థియేటర్ లో పఠాన్ సినిమా చూశారు, చూస్తూ ఉంటారు. మేము వద్దని చెప్పం అని అన్నాడు.