Pathaan Collections : ఆల్ టైం బాక్సాఫీస్ రికార్డులని బద్దలు కొడుతున్న పఠాన్.. ఈ రికార్డులన్నీ ఇక ‘పఠాన్’వే

పఠాన్ సినిమా షారుఖ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. అంతకుముందు 2013 లో చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాతో షారుఖ్ 420 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా, పఠాన్ సినిమా అయిదు రోజుల్లోనే.......................

Pathaan Collections : ఆల్ టైం బాక్సాఫీస్ రికార్డులని బద్దలు కొడుతున్న పఠాన్.. ఈ రికార్డులన్నీ ఇక ‘పఠాన్’వే

Pathaan movie Collections creates new records in industry

Pathaan Collections :  షారుఖ్, దీపికా జంటగా, జాన్ అబ్రహం విలన్ గా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా జనవరి 25న రిలీజయి భారీ విజయం సాధించింది. నాలుగేళ్ల తర్వాత షారుఖ్ తెరపై కనిపిస్తుండటంతో అభిమానులు సందడి చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమా కావడంతో ప్రేక్షకులు కూడా థియేటర్స్ కి వస్తున్నారు. ముందు నుంచి అంచనాలు ఉన్న పఠాన్ సినిమా ఆ అంచనాలని మొదటి రోజు నుంచే అందుకుంది. ఇప్పటికే పఠాన్ సినిమా అయిదు రోజుల్లో 542 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి సరికొత్త రికార్డులని సృష్టిస్తుంది.

ఇప్పటికే పలు రికార్డులని సృష్టిస్తున్న పఠాన్ తాజాగా మరిన్ని రికార్డులని సొంతం చేసుకుంది. పఠాన్ తన కలెక్షన్స్ తో పాత సినిమాల రికార్డులని చెరిపేస్తుంది. మొదటి రోజు అత్యధిక షేర్ కలెక్షన్స్ సాధించిన మొట్టమొదటి హిందీ సినిమా పఠాన్. మొదటి రోజు 57 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి ఆ రికార్డు క్రియేట్ చేసింది. అలాగే అత్యంత వేగంగా 100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన హిందీ సినిమా కూడా పఠాన్ నిలిచింది. అలాగే అత్యంత వేగంగా 200 కోట్ల క్లబ్ లో చేరిన ఇండియన్ సినిమాగా పఠాన్ రికార్డ్ క్రియేట్ చేసింది. పఠాన్ సినిమా నాలుగు రోజుల్లోనే 212 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి బాహుబలి 2 , KGF 2 సినిమాలని బీట్ చేసింది.

Pathaan Collections : పఠాన్ @ 550 కోట్లు.. ఆదివారం ఒక్కరోజే 130 కోట్లు..

పఠాన్ సినిమా షారుఖ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. అంతకుముందు 2013 లో చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాతో షారుఖ్ 420 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా, పఠాన్ సినిమా అయిదు రోజుల్లోనే 550 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి ఇంకా దూసుకుపోతుంది. అలాగే ఇండియాలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన హిందీ సినిమాగా పఠాన్ నిలిచింది. ఇప్పటిదాకా ఆ రికార్డ్ దంగల్ సినిమాకి 535 కోట్లతో ఓవరాల్ కలెక్షన్స్ తో ఉండగా, పఠాన్ సినిమా అయిదు రోజుల్లోనే దాన్ని బీట్ చేసి మరింత దూసుకెళ్తుంది. దీంతో ఇండియాలో హైయెస్ట్ గ్రాసింగ్ హిందీ సినిమాగా పఠాన్ నిలిచింది. ఇలా రోజుకొక సరికొత్త రికార్డులని క్రియేట్ చేస్తూ పఠాన్ సినిమా మరింత కలెక్షన్స్ సాధిస్తూ 1000 కోట్లను టార్గెట్ గా పెట్టుకొని దూసుకుపోతుంది.