Pathaan : ఒక్క సినిమా.. 8 దేశాల్లో షూటింగ్.. ‘పఠాన్’తో షారుఖ్ గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ..

ఇటీవలే పఠాన్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఇది సూపర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలా ఉంది. దీంతో షారుఖ్ ఫ్యాన్స్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పఠాన్ సినిమాని..............

Pathaan : ఒక్క సినిమా.. 8 దేశాల్లో షూటింగ్.. ‘పఠాన్’తో షారుఖ్ గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ..

Pathaan :  బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ వెండితెరపై కనిపించి నాలుగేళ్లు అయింది. దానికి ముందు కూడా ఫ్లాప్ సినిమాలే ఉన్నాయి. దీంతో షారుఖ్ ఫ్యాన్స్ ఒక సూపర్ సినిమా కోసం అల్లాడుతున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత షారుఖ్ గ్రాండ్ గా కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్ గా, జాన్ అబ్రహం ముఖ్య పాత్రలో భారీ బడ్జెట్ తో బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఇటీవలే పఠాన్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఇది సూపర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలా ఉంది. దీంతో షారుఖ్ ఫ్యాన్స్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పఠాన్ సినిమాని జనవరి 25 న పాన్ ఇండియా సినిమాగా రిలిజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా తాజాగా నిర్మాణ సంస్థ కొన్ని యాక్షన్ సీన్స్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఓ ట్వీట్ చేసి సినిమాపై మరింత హైప్ పెంచింది.

Pawan Kalyan : మరో సూపర్ క్రేజీ కాంబో.. RRR నిర్మాతతో.. సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్.. అఫీషియల్..

ఈ ట్వీట్ లో.. 8 దేశాల్లో, 3 సూపర్‌ స్టార్స్‌ తో, ఒక్క సినిమా పఠాన్ ని తెరకెక్కించాం. సినిమా యాక్షన్‌ సీక్వెన్సులని స్పెయిన్‌, యూఏఈ, టర్కీ, రష్యా, సెర్బియా, ఇటలీ, ఫ్రాన్స్‌, అఫ్గాన్‌ దేశాల్లో చిత్రీకరించాం. జనవరి 25న థియేటర్స్ లోకి మీ ముందుకి రాబోతున్నాం అంటూ పోస్ట్ చేసింది. దీంతో షారుఖ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత షారుఖ్ మరో రెండు సినిమాలని కూడా లైన్ లో పెట్టాడు. అట్లీ దర్శకత్వంలో ‘జవాన్‌’, రాజ్‌ కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో డుంకి సినిమాలు ఉన్నాయి..