Pathaan : పఠాన్ ఆ సినిమాల టార్గెట్స్ కొల్లగొడుతుందా?? టార్గెట్ @1000 కోట్లు??

ఇప్పుడు షారుఖ్ సినిమా హిట్ అవ్వడం రోజుకి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తుండటంతో బాలీవుడ్ వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇవాళ ఆదివారం, మరో వారం వరకు బాలీవుడ్ లోఎలాంటి పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవడంతో పఠాన్ కూడా కనీసం 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేయాలని...............

Pathaan : పఠాన్ ఆ సినిమాల టార్గెట్స్ కొల్లగొడుతుందా?? టార్గెట్ @1000 కోట్లు??

Pathaan :  షారుఖ్, దీపికా జంటగా జాన్ అబ్రహం విలన్ గా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా జనవరి 25న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత షారుఖ్ పఠాన్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు. దీంతో షారుఖ్ అభిమానులు థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నాడు. ఈ సినిమాకి ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ రోజు నుంచే భారీ కలెక్షన్స్ ని సాధిస్తుంది.

పఠాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 50 కోట్లు కలెక్ట్ చేయగా మొదటి రోజు ఏకంగా 102 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రస్తుతం నాలుగు రోజుల్లోనే 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దాదాపు 212 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఇవాళ ఆదివారం కావడంతో ఇవాళ్టితో 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేస్తుందని అంటున్నారు బాలీవుడ్ వర్గాలు. ఇప్పటికే పలు రికార్డులని క్రియేట్ చేస్తుంది పఠాన్ సినిమా.

గత సంవత్సర కాలంగా బాలీవుడ్ లో వచ్చిన సినిమా వచ్చినట్టు ఫ్లాప్ అవుతున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం మొత్తం మీద బాలీవుడ్ లో సూపర్ హిట్ అని చెప్పుకునే సినిమాలు చేతివేళ్ళతో లెక్కపట్టొచ్చు. దీంతో ఒకానొక సమయంలో బాలీవుడ్ పని అయిపొయింది అన్నారు. అదే సమయంలో పుష్ప, KGF 2, RRR, కాంతార, విక్రమ్ లాంటి సౌత్ సినిమాలు బాలీవుడ్ లో భారీ విజయాలు సాధించడంతో బాలీవుడ్ వర్గాలకి ఏం చేయాలో తెలియలేదు. మన సౌత్ సినిమాలు అక్కడ వందల కోట్లు కలెక్ట్ చేసాయి. KGF 2, RRR సినిమాలు మొత్తంగా దాదాపు 1200 కోట్లు కలెక్ట్ చేశాయి. ఈ రెండు సినిమాల ఎఫెక్ట్ బాలీవుడ్ మీద గట్టిగా పడింది.

Pathaan : నాలుగు రోజుల్లో నాలుగొందల కోట్లు.. అత్యంతవేగంగా పఠాన్ మరో సరికొత్త రికార్డ్..

ఇప్పుడు షారుఖ్ సినిమా హిట్ అవ్వడం రోజుకి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తుండటంతో బాలీవుడ్ వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇవాళ ఆదివారం, మరో వారం వరకు బాలీవుడ్ లోఎలాంటి పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవడంతో పఠాన్ కూడా కనీసం 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఎలా అయినా మన సౌత్ సినిమాలని బీట్ చేయాలని బాలీవుడ్ వాళ్ళు అనుకుంటున్నారట. ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ మాత్రమే కాదు బాలీవుడ్ కూడా బ్యాక్ అంటున్నారు. మరి బాలీవుడ్ వాళ్ళు అనుకున్నట్టు మన సౌత్ సినిమాల కలెక్షన్స్ ని పఠాన్ బ్రేక్ చేస్తుందా? కనీసం 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేస్తుందా చూడాలి. ఒకవేళ 1000 కోట్లు కలెక్ట్ చేసినా మన రికార్డులని బ్రేక్ చేయడం కష్టమే అంటున్నారు సౌత్ సినీ వర్గాలు. ఏమవుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.