Pathaan : ఆఫర్ అంటూ టికెట్ రేట్లు తగ్గించిన పఠాన్.. కలెక్షన్స్ కోసమేనా?? 1000 కోట్ల కోసం పఠాన్ ఎదురుచూపులు..

పఠాన్ సినిమా ఫిబ్రవరి 15 బుధవారం వరకు 963 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. సౌత్ సినిమాలు బాహుబలి, KGF కలెక్షన్స్ ని దాటించకపోయినా కనీసం 1000 కోట్లు అయినా కొల్లగొట్టాలని చాలా ఎదురు చూస్తుంది. ఇప్పటికే సినిమా రిలీజయి మూడు వారాలు అవుతుండటం.........................

Pathaan : ఆఫర్ అంటూ టికెట్ రేట్లు తగ్గించిన పఠాన్.. కలెక్షన్స్ కోసమేనా?? 1000 కోట్ల కోసం పఠాన్ ఎదురుచూపులు..

Pathaan movie unit announce offer in ticket price and waiting for 1000 crores collections

Pathaan :  షారుఖ్, దీపికా జంటగా, జాన్ అబ్రహం విలన్ గా, సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా మంచి విజయం సాధించి కలెక్షన్స్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ రోజు నుంచి హిట్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్ ని భారీగా వసూలు చేస్తుంది. ఈ సినిమాతో చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత షారుఖ్ హిట్ కొట్టడమే కాకుండా గత సంవత్సర కాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న బాలీవుడ్ కి పెద్ద విజయాన్ని అందించాడు. పఠాన్ సినిమా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజయింది.

ప్రీ బుకింగ్స్ తోనే మంచి కలెక్షన్స్ వసూలు చేసిన పఠాన్ అయిదు రోజుల్లోనే 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. అప్పట్నుంచి కొంచెం స్లోగా కలెక్షన్స్ ని వసూలు చేసుకుంటూ 800 కోట్ల వరకూ వచ్చింది. పఠాన్ సినిమా కలెక్షన్స్ పెంచడానికి, సౌత్ సినిమా వేలకోట్ల కలెక్షన్స్ బద్దలుకొట్టడానికి బాలీవుడ్ అంతా ఒక్కటై తన సినిమాలని వాయిదా వేస్తూ, పఠాన్ ని మరింత ప్రమోట్ చేశారు. ఎలాగోలా 900 కోట్లకు వచ్చిన పఠాన్ అక్కడ్నుంచి మాత్రం చాలా మెల్లిగా రోజుకి 10 కోట్ల చొప్పున కలెక్ట్ చేస్తూ వస్తుంది. వీకెండ్స్ లో కలెక్షన్స్ పర్వాలేదనిపించినా వీక్ డేస్ లో మాత్రం పఠాన్ కలెక్షన్స్ తగ్గిపోయాయి.

పఠాన్ సినిమా ఫిబ్రవరి 15 బుధవారం వరకు 963 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. సౌత్ సినిమాలు బాహుబలి, KGF కలెక్షన్స్ ని దాటించకపోయినా కనీసం 1000 కోట్లు అయినా కొల్లగొట్టాలని చాలా ఎదురు చూస్తుంది. ఇప్పటికే సినిమా రిలీజయి మూడు వారాలు అవుతుండటం, వేరే భాషల్లో వేరే సినిమాలు కూడా రిలీజ్ అవుతుండటంతో కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి 17న సౌత్ లో ధనుష్ సార్ సినిమా, నార్త్ లో కార్తీక్ ఆర్యన్ షెహజాదా సినిమా రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలు రిలీజ్ అయితే పఠాన్ కి పూర్తిగా కలెక్షన్స్ తగ్గిపోతాయి. ఇప్పటికే పఠాన్ కలెక్షన్స్ కోసం షెహజాదా సినిమా మూడు వారాలు వాయిదా పడింది. దీంతో ఎలాగైనా పఠాన్ ని 1000 కోట్లు దాటించాలని సరికొత్త అఫర్ ప్రకటించింది చిత్ర యూనిట్.

Vey Dharuvey : ‘వెయ్ దరువేయ్’ టీజర్ రిలీజ్.. ఫుల్ మాస్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్న సాయిరామ్ శంకర్..

ఈ శుక్రవారం నాడు అంటే ఫిబ్రవరి 17న పఠాన్ సినిమా టికెట్ రేట్లను ఇండియా అంతటా తగ్గించింది. ఇప్పటివరకు మల్టిప్లెక్స్ లలో 250 అంతకు పైగా ఉన్న టికెట్ రేట్లను 110 రూపాయలకు తగ్గించింది పఠాన్ చిత్రయూనిట్. దేశమంతటా ఈ టికెట్ రేట్లు తగ్గించడంతో జనాలు వస్తారని, ఒకవేళ రేపు రిలీజ్ అయ్యే సినిమాలకు టికెట్స్ దొరక్కపోతే ఈ సినిమాకి వస్తారని, ఈ ఆఫర్ తో కలెక్షన్స్ పెరిగి 1000 కోట్లు దాటే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారు చిత్రయూనిట్. మొత్తానికి 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని దాటడానికి గత వారం రోజులుగా పఠాన్ చాలా ట్రై చేస్తుంది. ఎలాగోలా కష్టపడి 1000 కోట్లు దాటినా మన బాహుబలి, KGF కలెక్షన్స్ మాత్రం దాటాలంటే కష్టమే.