Pathaan: పఠాన్ దెబ్బకు షేక్ అవుతోన్న ఓవర్సీస్ బాక్సాఫీస్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ భారీ అంచనాల మధ్య రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించగా, ఈ సినిమాలో షారుక్ సరికొత్త లుక్‌తో పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇక ఈ సినిమాకు తొలిరోజు నుంచే అన్ని వర్గాల ప్రేక్షకులు పట్టం కడుతుండటంతో ఈ సినిమాను చూసేందుక ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు.

Pathaan: పఠాన్ దెబ్బకు షేక్ అవుతోన్న ఓవర్సీస్ బాక్సాఫీస్

Pathaan Shaking Overseas BoxOffice

Pathaan: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ భారీ అంచనాల మధ్య రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించగా, ఈ సినిమాలో షారుక్ సరికొత్త లుక్‌తో పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇక ఈ సినిమాకు తొలిరోజు నుంచే అన్ని వర్గాల ప్రేక్షకులు పట్టం కడుతుండటంతో ఈ సినిమాను చూసేందుక ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు.

Pathaan : లోక్ సభలో పఠాన్ సినిమా గురించి మోడీ వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న వీడియో!

ఈ సినిమా రిలీజ్ అయ్యి రోజులు గడుస్తున్నా, బాలీవుడ్‌లో మరే ఇతర బడా సినిమా రాకపోవడంతో ప్రేక్షకులు పఠాన్ సినిమానే మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఇక ఓవర్సీస్ ఆడియెన్స్ కూడా ఈ సినిమాకు అడిక్ట్ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. తాజాగా పఠాన్ మూవీ యూఎస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది.

Pathaan : సెకండ్ వీకెండ్‌లో కూడా తగ్గని పఠాన్ కలెక్షన్స్.. కేజీఎఫ్-2 రికార్డు బ్రేక్?

పఠాన్ మూవీ యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 15 మిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసి తన సత్తా చాటింది. ఇండియన్ సినిమాల్లో ఈ రికార్డు సాధించిన రెండో సినిమాగా పఠాన్ నిలిచింది. బాహుబలి-2 తరువాత ఈ మార్క్‌ను అందుకున్న మూవీగా పఠాన్ నయా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో జాన్ అబ్రహాం, దీపికా పదుకొనేలు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, యశ్ రాజ్ ఫిలింస్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.