Pathaan: పఠాన్ @ వెయ్యి కోట్ల మార్క్.. మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిందిగా!

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమాను దర్శకుడు సిద్దార్థ్ మల్హోత్రా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది.

Pathaan: పఠాన్ @ వెయ్యి కోట్ల మార్క్.. మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిందిగా!

Pathaan: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమాను దర్శకుడు సిద్దార్థ్ మల్హోత్రా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది.

Pathaan : సెకండ్ వీకెండ్‌లో కూడా తగ్గని పఠాన్ కలెక్షన్స్.. కేజీఎఫ్-2 రికార్డు బ్రేక్?

ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఈ సినిమాలో షారుక్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా తొలిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపే కలెక్షన్స్‌తో దూసుకెళ్తుండటంతో ఈ మూవీ టోటల్ రన్‌లో ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో పఠాన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.865 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.

ఇక ఈ సినిమా టోటల్ రన్‌లో వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఈ సినిమా టికెట్ రేట్లు తగ్గడంతో, ఈ మూవీ టోటల్ రన్‌లో వెయ్యి కోట్ల మార్క్ క్రాస్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.