Pathaan x Tiger Theme : పఠాన్ వర్సెస్ టైగర్ థీమ్ రిలీజ్.. స్పై యూనివర్స్ స్పీడ్ పెంచిన యశ్ రాజ్ ఫిలిమ్స్..

పఠాన్ వర్సెస్ టైగర్ అసలు ఎలా ఉండబోతోంది..? ఒక వైపు పఠాన్ గా షారూఖ్ ఖాన్, మరో వైపు టైగర్ గా సల్మాన్ ఖాన్ పోటీపడితే ఎలా ఉంటుందో అనే ఊహలు పెంచేస్తూ పవర్ ఫుల్ వీడియో రిలీజ్ చేసింది యశ్ రాజ్ ఫిల్మ్స్.

Pathaan x Tiger Theme : పఠాన్ వర్సెస్ టైగర్ థీమ్ రిలీజ్.. స్పై యూనివర్స్ స్పీడ్ పెంచిన యశ్ రాజ్ ఫిలిమ్స్..

Pathaan x Tiger Theme released by Yash Raj films

Pathaan x Tiger Theme : పఠాన్(Pathaan) సక్సెస్ ని మరిచిపోకముందే, బాక్సాఫీస్ లెక్కలు ఇంకా తేలకముందే భాయ్ ఈ శుక్రవారం బాక్సాఫీస్ రూల్ కి రెడీ అవుతున్నాడు. ఒక్కొక్కరు సెపరేట్ గా వస్తేనే రికార్డులు పేరు మార్చుకుంటుంటే ఇక ఇద్దరూ కలిసి రాబోతున్న పఠాన్ వర్సెస్ టైగర్(Tiger) కలిసొస్తే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో లేటెస్ట్ గా థీమ్ రిలీజ్ చేసి శాంపిల్ చూపించారు మేకర్స్.

షారూఖ్ ఖాన్ హీరోగా వచ్చిన పఠాన్ తో బాక్సాఫీస్ బద్దలు కొట్టింది యశ్ రాజ్ ఫిల్మ్స్. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పీరెన్స్ కూడా ఇచ్చాడు. ఇటీవల కొన్ని సినిమాలకు లింక్స్ ఇస్తూ సినిమాటిక్ యూనివర్స్ సృష్టిస్తున్నారు. హాలీవుడ్ లో ఎప్పటినుంచో ఉన్నా ఇండియాలో ఇప్పుడిప్పుడే మొదలైంది. దీంతో పఠాన్ సక్సెస్ తర్వాత యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ అనౌన్స్ చేసింది. గతంలో వచ్చిన వార్, టైగర్, పఠాన్ సినిమాలకు లింక్ చేస్తూ రాబోయే టైగర్ 3, వార్ 2, టైగర్ వర్సెస్ పఠాన్.. ఇలా పలు సినిమాలు అనౌన్స్ చేసింది. దీంతో అభిమానులు ఆశ్చర్యపోతూ ఈ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాల్లో బాలీవుడ్ స్టార్స్ ఒకరిద్దరు కలిసి నటించబోతున్నారు.

యశ్ రాజ్ ఫిల్మ్స్ ఏదో అనౌన్స్ మెంట్ ఇచ్చారు కానీ పఠాన్ వర్సెస్ టైగర్ ఇప్పుడెక్కడ పని మొదలుపెడుతుంది అని అనుకున్నవాళ్లందరికీ ఫుల్ క్లారిటీ ఇచ్చింది టీమ్. పఠాన్, టైగర్ పోటీ పడితే ఎలా ఉంటుందో ఒక్క వీడియో తో చూపించేశారు మేకర్స్.

పఠాన్ వర్సెస్ టైగర్ అసలు ఎలా ఉండబోతోంది..? ఒక వైపు పఠాన్ గా షారూఖ్ ఖాన్, మరో వైపు టైగర్ గా సల్మాన్ ఖాన్ పోటీపడితే ఎలా ఉంటుందో అనే ఊహలు పెంచేస్తూ పవర్ ఫుల్ వీడియో రిలీజ్ చేసింది యశ్ రాజ్ ఫిల్మ్స్. పఠాన్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్న షారూఖ్, టైగర్ 3తో రాబోతున్న సల్మాన్ ఖాన్ ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న పఠాన్ వర్సెస్ టైగర్ మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తే ఆ రేంజ్ వేరు. దీంతో పఠాన్ వర్సెస్ టైగర్ అనే థీమ్ తో ఓ మ్యూజిక్ వీడియో రిలీజ్ చేశారు యశ్ రాజ్ ఫిలిమ్స్.

Nidhhi Agerwal : పాపం నిధి అగర్వాల్.. పవన్ కళ్యాణ్ సినిమా నిధికి మైనస్ అవుతుందా?

పఠాన్ సినిమాలో షారుఖ్, సల్మాన్ కలిసి చేసిన ఫైట్ ని తీసుకొని ఓ డార్క్ థీమ్ లో మ్యూజిక్ ఇచ్చి వీడియోని రిలీజ్ చేశారు యశ్ రాజ్ ఫిలిమ్స్. ఈ వీడియో వైరల్ కాగా ఇద్దరి హీరోల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అటు పఠాన్, ఇటు టైగర్ ఇద్దరూ కలిస్తే బెస్ట్ ఎవర్ సినిమాగా నిలిచిపోతుందని భావిస్తున్నారు. పఠాన్ వర్సెస్ టైగర్ థీమ్ మ్యూజిక్ కే విపరీతమైన రెస్పాన్స్ వస్తుంటే ఇక సినిమా ఏరేంజ్ లో ఉంటుందో అని అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే బేసిక్ స్టోరీ లాక్ చేసుకున్న పఠాన్ వర్సెస్ టైగర్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. సిద్దార్ద్ ఆనంద్ డైరెక్షన్లో పవర్ ఫుల్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది.