Pathaan : కేజీఎఫ్-2 రికార్డు బ్రేక్ చేయడానికి అతి చేరువలో ఉన్న పఠాన్..

ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన బాలీవుడ్ సినిమాలు ఇప్పుడు సరైన ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక పోతున్నాయి. ఈ మధ్య కాలంలో బ్రహ్మాస్త్ర సినిమా తప్ప మరే హిందీ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించలేక పోయాయి. దీంతో బాలీవుడ్ డీలా పడిపోయింది. అయితే షారుఖ్ ఖాన్ తన పఠాన్ సినిమా ఓపెనింగ్స్ తో బి-టౌన్ లో సందడి తీసుకు వస్తున్నాడు.

Pathaan : కేజీఎఫ్-2 రికార్డు బ్రేక్ చేయడానికి అతి చేరువలో ఉన్న పఠాన్..

Pathaan kgf 2

Pathaan : ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన బాలీవుడ్ సినిమాలు ఇప్పుడు సరైన ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక పోతున్నాయి. ఈ మధ్య కాలంలో బ్రహ్మాస్త్ర సినిమా తప్ప మరే హిందీ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించలేక పోయాయి. దీంతో బాలీవుడ్ డీలా పడిపోయింది. అయితే షారుఖ్ ఖాన్ తన పఠాన్ సినిమా ఓపెనింగ్స్ తో బి-టౌన్ లో సందడి తీసుకు వస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా భారీగా విడుదల అవుతుంది. దేశంలో ఏ సినిమా విడుదల అవ్వనన్ని థియేటర్ లో దాదాపు 5000 స్క్రీన్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

Shah Rukh Khan: చరణ్ తీసుకెళ్తే పఠాన్ సినిమా చూస్తానంటోన్న కింగ్ ఖాన్!

తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్ అవ్వడంతో సౌత్ లో కూడా భారీ స్థాయిలోనే విడుదల కాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రీ బుకింగ్స్ లో రికార్డులు సృష్టిస్తుంది. 10 రోజుల ముందుగానే PVR మరియు INOX వంటి మల్టీప్లెక్స్‌ లో టిక్కెట్ విక్రయాలు ప్రారంభం కాగా టిక్కెట్లు భారీగా అమ్ముడుపోయాయి. ఇప్పటి వరకు 2.65 లక్షల టిక్కెట్లు సేల్ అయ్యాయి. ప్రీ బుకింగ్ సేల్స్ లో 5.15 లక్షలు టికెట్లతో KGF2 మొదటి స్థానంలో ఉంటే, 3.02 లక్షల టిక్కెట్ అమ్మకాలతో బ్రహ్మాస్త్ర రెండో స్థానంలో నిలిచింది. వీటి తరువాత మూడో ప్లేస్ లో పఠాన్ ఉంది.

రిలీజ్ కి ఇంకా మూడు రోజులు సమయం ఉండడంతో, ఈ సినిమా ఇదే వేగాన్ని కంటిన్యూ చేస్తే కేజీఎఫ్-2 రికార్డుని బ్రేక్ చేయడం ఖాయం అంటున్నారు సినీ పండితులు. కాగా ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేక వ్యక్తం అవుతున్న సమయంలో కూడా ఈ రేంజ్ లో టికెట్లు అమ్మడు పోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్రమోట్ చేస్తుంది చిత్ర యూనిట్. పఠాన్ ట్రైలర్ ని ప్లే చేస్తూ ప్రముఖ నగరాల్లో LED వ్యాన్ లు నడుపుతున్నారు మేకర్స్. మరి పఠాన్ అన్ని అడ్డంకులు దాటుకొని కష్టాల్లో ఉన్న బాలీవుడ్ కి అదిరిపోయే సక్సెస్ ని అందిస్తుందా? లేదా? అనేది చూడాలి.