Unstoppable : నాగబాబు – బాలకృష్ణ ఇష్యూని పవర్ స్టార్ సాల్వ్ చేశాడా??

ఈ ఎపిసోడ్ లో పాలిటిక్స్ తో పాటు చివర్లో మళ్ళీ సినిమాలు, పవన్ పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడారు. ఇక వెళ్లేముందు బాలయ్య షో ముందు, షో తర్వాత తన గురించి ఏమనుకుంటున్నావో చెప్పి వెళ్ళు అని పవన్ ని అడగడంతో పవన్ మాట్లాడుతూ..................

Unstoppable : నాగబాబు – బాలకృష్ణ ఇష్యూని పవర్ స్టార్ సాల్వ్ చేశాడా??

pawan kalan says how much nagababu likes balakrishna in Unstoppable show

Unstoppable :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో సూపర్ గా సక్సెస్ అయింది. మొదటి సీజన్ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్ కూడా మరింత గ్రాండ్ గా చేశారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు ఆహా. ఈ ఎపిసోడ్ ఎక్కువ స్ట్రీమింగ్ టైం సాధించి సరికొత్త రికార్డులని సెట్ చేసింది. ఈ ఎపిసోడ్ లో సరదాగా మాట్లాడుతూ, సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. తాజాగా ఫిబ్రవరి 9 గురువారం రాత్రి బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 రిలీజ్ చేశారు.

బాలయ్య-పవన్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి అటు బాలయ్య అభిమానులు, ఇటు పవన్ అభిమానులు హంగామా చేశారు. వరుసగా పోస్టర్లు, ఫోటోలు, ప్రోమోలు.. వదులుతూ ఆహా టీం కూడా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా రిలీజ్ అయిన పవన్ బాలయ్య ఎపిసోడ్ తో ఈ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. మొదటి పార్ట్ లో అంతా సినిమాలు, పర్సనల్ లైఫ్ ఉంటే రెండో పార్టీ లో చాలా వరకు పాలిటిక్స్ గురించి ఉంది. దీంతో ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ ఎపిసోడ్ లో పాలిటిక్స్ తో పాటు చివర్లో మళ్ళీ సినిమాలు, పవన్ పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడారు. ఇక వెళ్లేముందు బాలయ్య షో ముందు, షో తర్వాత తన గురించి ఏమనుకుంటున్నావో చెప్పి వెళ్ళు అని పవన్ ని అడగడంతో పవన్ మాట్లాడుతూ.. బాలకృష్ణ ముక్కుసూటి మనిషి అని తెలుసు. ఆయన ఏదున్నా ముఖం మీదే చెప్పేస్తాడు. ఈ షో తర్వాత ఆయనలో ఎంత ప్రేమ ఉందో కూడా తెలిసింది. ఆయన సినిమాలు అన్ని హిట్ అవ్వాలి. రాజకీయంగా కూడా ఆయన మరింత ఎదగాలి. ఆయన మంచితనం నాకు ఇష్టం. మేమంతా రాజకీయంగా ఎన్ని పార్టీల్లో ఉన్నా సినిమాల్లో మేమంతా ఒక్కటే. మేమంతా ఇలా కలిసి మాట్లాడుకుంటాం, మాట్లాడుకోవాలి అని అన్నారు. అయితే ఇదే ఫ్లోలో మాట్లాడుతూ మా నాగబాబు అన్నయ్య కూడా మీ గురించి మంచిగా చెప్తారు. ఒకానొక సమయంలో మీ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినప్పుడు నాగబాబు అన్నయ్య.. బాలకృష్ణ గారు చాలా కష్టపడతారు, ఆయనకి మంచి హిట్ పడాలి, ఆయన సినిమాలు హిట్ అవ్వాలని కోరుకున్నారు. ఆయనతో పాటు మేమంతా కూడా బాలకృష్ణ సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటాం అని తెలిపాడు. దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Unstoppable : ఫిలిం నగర్ మహాప్రస్థానం సిబ్బందిని సన్మానించిన బాలయ్య-పవన్..

గతంలో బాలయ్యని నాగబాబు విమర్శించిన సంగతి తెలిసిందే. పలు మార్లు ఒకరిపై ఒకరు రాజకీయంగా, పర్సనల్ గా వ్యాఖ్యలు చేసుకున్నారు. నాగబాబు బాలయ్యపై కౌంటర్లు వేశాడు. అప్పట్లో ఇది మెగా, నందమూరి ఫ్యాన్ వార్ కి కూడా దారి తీసింది. తాజాగా ఇక్కడ నాగబాబు ప్రస్తావన రాకపోయినా నాగబాబు బాలకృష్ణ గురించి గొప్పగా చెప్పినట్టు, అతని సినిమాలు ఆడాలని కోరుకుంటున్నట్టు చెప్పి వీరిద్దరి మధ్య ఉన్న దూరం తగ్గించాడా? వీరిద్దరి మధ్య ఉన్న ఇష్యూ ని సాల్వ్ చేశాడా అని అనుకుంటున్నారు. అదే జరిగితే మంచిదే కదా అని అంతా భావిస్తున్నారు.