PSPK : వావ్.. బండ్ల భలే టైటిల్ ఫిక్స్ చేశాడుగా..!

కొంత గ్యాప్ తర్వాత పవన్ - బండ్ల గణేష్ కాంబినేషన్‌లో సినిమా రానుందని అనౌన్స్ చేశారు.. ప్రస్తుతం పవన్ కోసం స్టార్ డైరెక్టర్లని లైన్‌లో పెట్టే పనిలో ఉన్నాడు బండ్ల..

PSPK : వావ్.. బండ్ల భలే టైటిల్ ఫిక్స్ చేశాడుగా..!

Pspk

PSPK: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమా ఇండస్ట్రీలోనూ ఆయనకు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నితిన్ లాంటి యంగ్ హీరో తనను తాను పీకే ఏకలవ్య శిష్యుడిగా చెప్పుకుంటుంటాడు. అప్పుడప్పుడు తన అభిమాన హీరో సినిమా నైజాం రైట్స్ కొనుక్కుని తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడు.

Pspk Bandla Ganesh

ఇక ఆ రేంజ్‌లో పవన్‌కు తాను భక్తుడినని చెప్పుకుంటాడు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. ‘తీన్‌మార్’ సినిమాతో తనను నిర్మాతగా పరిచయం చేసిన పవన్ అంటే బండ్లకు ప్రత్యేకమైన అభిమానం. తర్వాత తన బాస్‌కి ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చానని గర్వంగా కాలర్ ఎగరేసి మరీ చెప్పుకుంటాడు.

కొన్ని ఫంక్షన్లలో పవర్‌స్టార్ మీద తన ప్రేమను అభిమానాన్ని ఏ స్థాయిలో చెప్పుకున్నాడో తెలిసిందే. ఇటీవల ‘వకీల్ సాబ్’ ఫంక్షన్లో ‘ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా..’ అంటూ పంచులు పేల్చి హైలెట్ అయ్యాడు. కొంత గ్యాప్ తర్వాత పవన్ – బండ్ల గణేష్ కాంబినేషన్‌లో సినిమా రానుందని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం పవన్ కోసం స్టార్ డైరెక్టర్లని లైన్‌లో పెట్టే పనిలో ఉన్నాడు బండ్ల. ఈ సినిమా కోసం ‘దేవరా’ అనే టైటిల్ ఫిలింఛాంబర్‌లో రిజిస్టర్ చేయించాడట బండ్ల గణేష్.