PSPK 28 : జాతర షురూ.. మళ్లీ, ఫుల్లీ లోడింగ్..

పవర్‌స్టార్ బర్త్‌డే ట్రీట్.. హరీష్ శంకర్ సినిమా అప్‌డేట్ కూడా వచ్చేసింది.. ‘మళ్లీ, ఫుల్లీ లోడింగ్’..

PSPK 28 : జాతర షురూ.. మళ్లీ, ఫుల్లీ లోడింగ్..

Pspk 28

PSPK 28: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సాలిడ్ బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాల అప్‌‌డేట్స్‌తో ప్రేక్షకాభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ‘భీమ్లా నాయక్’, ‘హరి హర వీర మల్లు’, సురేందర్ రెడ్డి సినిమాలతో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్లో చెయ్యబోయే సినిమా అప్‌డేట్ కూడా వచ్చేసింది.

Bheemla Nayak Fans Reaction : థమన్ అన్నా.. ఏం తాగి కొట్టావన్నా మ్యూజిక్..!

పవన్ – హరీష్ శంకర్ కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో చెప్పక్కర్లేదు. అదిరిపోయే కాంబినేషన్లతో వరుసగా సూపర్ హిట్ సినిమాలను నిర్మిస్తున్న టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు వీళ్లిద్దరితో ఓ సాలిడ్ సినిమా సెట్ చేసింది.

Hari Hara Veera Mallu : ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.. రెండు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలు..

పవన్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు.. ‘జాతర షురూ.. మళ్లీ (Fully)లోడింగ్’.. అంటూ హార్లీ డేవిడ్‌సన్ డీలక్స్ బైక్‌పై స్టైలిష్‌గా కూర్చుని ఉన్న పవన్‌ని సగం చూపిస్తూ డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ‘This Time, it’s not just Entertainment’ అనే క్యాప్షన్‌తో ఈసారి ‘గబ్బర్ సింగ్’ ని మించిన సక్సెస్ కొడతామని హింట్ ఇచ్చారు.

Pawan Kalyan : ఇదీ పవర్‌స్టార్ స్టామినా.. అప్పుడు 5 వేలు.. ఇప్పుడు 50 కోట్లు..

ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్, హరీష్ శంకర్, డిఎస్పీ కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సాంగ్స్ సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఈసారి వీళ్ల కలయికలో అంతకుమించి అదిరిపోయే సినిమా రాబోతోంది అని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు టీం.