Pawan Kalyan : అకిరా కోసం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసిన పవన్, రేణు దేశాయ్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..

తాజాగా పవన్, రేణుదేశాయ్ తో విడాకుల అనంతరం మొదటిసారి కలిశారు. అకిరా నందన్ ఓ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతున్నాడు. సోమవారం రాత్రి పవన్.. అకిరా నందన్ స్కూల్ లో.......................

Pawan Kalyan : అకిరా కోసం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసిన పవన్, రేణు దేశాయ్.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..

Pawan

Pawan Kalyan :  పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ప్రస్తుతం పవన్ ఒకపక్క సినిమాలతో, మరో పక్క రాజకీయాలతో చాలా బిజీబిజీగా ఉన్నాడు. ఇంత బిజీలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ హాజరవడం ఇప్పుడు వైరల్ గా మారింది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్.

పవన్, రేణు దేశాయ్ కి ఎప్పుడో విడాకులు ఇచ్చేశారు. విడాకులు ఇచ్చిన తర్వాత తన పిల్లలు అకిరా, ఆద్యలు రేణు దేశాయ్ దగ్గరే పెరుగుతున్నా పవన్ కూడా వాళ్ళని చూసుకుంటూ ఉంటారు, వారికి కావాల్సినవి అన్ని సమకూరుస్తారు. రేణుదేశాయ్ తో విడిపోయినా అప్పుడప్పుడు పవన్ తన పిల్లలని కలుస్తూ ఉంటాడు, తనతో పాటు మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి తీసుకెళ్తూ ఉంటాడు. ఇలా పిల్లల కోసం మాత్రం పవన్ వస్తాడు. కానీ పిల్లలని ఎన్ని సార్లు కలిసినా విడాకుల తర్వాత రేణు దేశాయ్ ని కలిసింది లేదు. వీరు మళ్ళీ కలిసినట్లు ఒక్క ఫోటో కానీ, వీడియో కానీ లేవు.

తాజాగా పవన్, రేణుదేశాయ్ తో విడాకుల అనంతరం మొదటిసారి కలిశారు. అకిరా నందన్ ఓ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతున్నాడు. సోమవారం రాత్రి పవన్.. అకిరా నందన్ స్కూల్ లో గ్రాడుయేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అకిరా గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో తండ్రిగా బాధ్యత తీసుకొని పవన్ ఈ కార్యక్రమానికి వచ్చారు. రేణు దేశాయ్ కూడా తల్లి స్థానంలో ఈ కార్యక్రమానికి రాగా చాలా సంవత్సరాల తర్వాత పవన్, రేణు దేశాయ్, అకిరా, ఆద్య కలిసి ఫ్యామిలీ ఫోటో దిగారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sai Pallavi : ఐటెం సాంగ్స్ అస్సలు చేయను.. అలాంటి బట్టలు నాకు సెట్ అవ్వవు..

తనకెన్ని పనులు ఉన్నా, రేణు దేశాయ్ తో విడాకులు అయినా తన పిల్లల కోసం తండ్రిగా ఏం చేయడానికి అయినా రెడీ అని పవన్ మరోసారి నిరూపించారు ఈ కార్యక్రమంతో. పవన్, రేణు దేశాయ్ ఇలా కలవడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఆ ఫోటోని వైరల్ చేసేస్తూ ఖుషీ అవుతున్నారు పవన్ ఫ్యాన్స్. ఇక ఈ ఫోటోని రేణు దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. ఈ ఫోటోని షేర్ చేసి.. నా కొడుకు అప్పుడే పెద్దోడైపోయాడు, ఇక్కడి నుంచి తన సొంత కాళ్ళ మీద మీద నిలబడాలి అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ ని పెట్టింది.