నవంబర్ 22న ‘జార్జ్ రెడ్డి’ : పవన్ అతిథిగా ఆడియో వేడుక

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్).. ఆడియో ఫంక్షన్.. నవంబర్ 22న సినిమా విడుదల..

10TV Telugu News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్).. ఆడియో ఫంక్షన్.. నవంబర్ 22న సినిమా విడుదల..

టాలీవుడ్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ బయోపిక్ ‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్).. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడి, లక్ష్య సాధనలో ప్రాణాలర్పించిన జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ‘జార్జ్ రెడ్డి’ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. త్వరలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నాడు.

జార్జ్ రెడ్డి ఈ జనరేషన్‌కి తెలియకపోవచ్చేమో కానీ, 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన జీవితం గురించి తెలుసు. అలాంటి టెర్రిఫిక్ లీడర్ గురించి ఈ తరం తెలుసుకునేలా ‘జార్జ్ రెడ్డి’.. సినిమాను రూపొందించారు. సిల్లీ మాంక్స్, త్రీ లైన్ సినిమా బ్యానర్స్‌తో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మించగా, ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి డైరెక్ట్ చేశాడు.

Read Also : 50 మిలియన్స్ మార్క్ టచ్ చేసిన ‘సామజవరగమన’

వంగవీటి మూవీతో ఆకట్టుకున్న సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి క్యారెక్టర్‌ చేయగా.. సత్యదేవ్, మనోజ్ నందం, అభయ్ బేతిగంటి, శత్రు తదితరులు ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. నవంబర్ 22న ‘జార్జ్ రెడ్డి’ రిలీజ్ కానుంది. కెమెరా : సుధాకర్ యెక్కంటి, సంగీతం : సురేష్ బొబ్బిలి, బ్యాగ్రౌండ్ స్కోర్ : హర్ష వర్ధన్ రామేశ్వర్, సహ నిర్మాత : సంజయ్ రెడ్డి, అసోసియేట్ ప్రొడ్యూసర్స్ : దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి.

 

10TV Telugu News