Unstoppable 2: తమ్ముడు సినిమాలో అంతా డూపా.. బాలయ్య ప్రశ్నకు పవన్ ఏమన్నాడంటే..?
యావత్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వర్సెస్ నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్-2 పవర్‌ఫుల్ ఎపిసోడ్ మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఇప్పటికే షో నిర్వాహకులు ప్రకటించారు. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన అన్‌స్టాపబుల్ 2 పవర్‌ఫుల్ ఎపిసోడ్ ప్రోమోకు ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది.

Unstoppable 2: యావత్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వర్సెస్ నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్-2 పవర్‌ఫుల్ ఎపిసోడ్ మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఇప్పటికే షో నిర్వాహకులు ప్రకటించారు. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన అన్‌స్టాపబుల్ 2 పవర్‌ఫుల్ ఎపిసోడ్ ప్రోమోకు ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది.
Unstoppable 2: పవన్ సాక్షిగా సాయి ధరమ్ తేజ్‌తో ఆటాడుకున్న బాలయ్య
తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఓ స్పెషల్ గ్రింప్స్‌ను వదిలారు షో నిర్వాహకులు. పవన్ కళ్యాణ్ వర్సెస్ బాలయ్య ఎపిసోడ్‌లో ఎలాంటి ఆసక్తికర విషయాలు సాగబోతున్నాయో ఈ స్పెషల్ గ్లింప్స్‌లో మనకు ఓ శాంపిల్ చూపెట్టారు. పవన్ నటించిన తమ్ముడు సినిమాలో చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు అంతా డూపా అని బాలయ్య పవన్‌ను అడిగాడు. దీనికి పవన్ సరదాగా నవ్వుతూ కనిపించాడు. ఇక తనకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదని.. బోర్డును ఇలా తిప్పాలనిపిస్తుందని పవన్ చెప్పడంతో బాలయ్య కూడా నవ్వుకున్నాడు. అయితే ఓ స్తంభాన్ని కొట్టాల్సిన సీన్‌లో పవన్ చేతికి రక్తం వస్తుండగా.. షాట్ అయిపోయాక దీనికి ఆర్ట్ డైరెక్టర్ ఎవరో రమ్మని పిలిచినట్లుగా పవన్ పేర్కొన్నాడు.
ఇలా పవన్ సినిమాలకు సంబంధించి బాలయ్య చాలా ప్రశ్నలను సంధించనున్నాడని.. వాటికి పవన్ కూడా అంతే ఓపికగా సమాధానం చెప్పబోతున్నట్లుగా ఈ స్పెషల్ గ్లింప్స్ వీడియోతో మనకు తెలియజేశారు షో నిర్వాహకులు. ఇక ఈ పవర్‌ఫుల్ ఎపిసోడ్‌తో బాలయ్య అన్‌స్టాపబుల్ 2 సీజన్ ముగింపుకు చేరుకోనుందని షో నిర్వాహకులు ఇప్పటికే వెల్లడించారు.