Pawan Kalyan: ఈ వారం రిలీజ్ అవుతున్న పవన్ సినిమా.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడు మీద ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, భవదీయుడు భగత్‌సింగ్ త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టేందుకు రెడీగా ఉంది.

Pawan Kalyan: ఈ వారం రిలీజ్ అవుతున్న పవన్ సినిమా.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడు మీద ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, భవదీయుడు భగత్‌సింగ్ త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టేందుకు రెడీగా ఉంది. ఇక ఈ సినిమాలతో పవన్ బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు సందడి చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, పవన్ మాత్రం సైలెంట్‌గా సెప్టెంబర్ రెండో వారంలోనే ఓ సినిమాను రిలీజ్ చేసేస్తున్నాడు.

Pawan Kalyan: ఆ డైరెక్టర్‌తో సినిమా ఉందంటున్న పవన్.. కానీ ఎప్పుడో?

పవన్ కళ్యాణ్ నటించిన లాస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించిన తీరు, పవన్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, రానా దగ్గుబాటి నటన కలగలిసి ఈ సినిమాను సక్సెస్ చేశాయి. ఇక థమన్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అయితే ఈ సినిమాను ఇప్పుడు తమిళంలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. కాగా, భీమ్లా నాయక్ తమిళ వర్షన్ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా తమిళ్’లో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయ్యారు.

Bheemla Nayak: భీమ్లా నాయక్ వచ్చేస్తున్నాడోచ్.. ఇక బాక్సులు బద్దలే!

సెప్టెంబర్ 9న ఈ సినిమాను ఆహా తమిళ్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో పవన్ అభిమానులు ఈ సినిమాను తమిళంలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ నిత్యా మీనన్, సంయుక్తా మీనన్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మరి తమిళంలో భీమ్లా నాయక్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.