BRO: బ్రో నుంచి మరో క్రేజీ అప్డేట్.. మరి ఇంత స్పీడా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan), సుప్రీం హీరో సాయిధరమ్(Sai Dharam Tej) కలిసి నటిస్తున్న సినిమా ‘Bro’. తాజాగా చిత్ర బృందం నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది.

BRO Dubbing works starts
BRO Dubbing works: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan), సుప్రీం హీరో సాయిధరమ్(Sai Dharam Tej) కలిసి నటిస్తున్న సినిమా ‘Bro’. తమిళంలో ఘన విజయం సాధించిన వినోదయ సితం(Vinodaya Sitham) కి ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. సముద్రఖని(Samuthirakani) దర్శత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే సినిమా షూటింగ్ పార్ట్ పూరైంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్ర బృందం నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ సినిమా డబ్బింగ్ వర్క్‌ను ప్రారంభించినట్లు తెలియజేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పూజకు సంబంధించిన ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Bro : మామా అల్లుళ్ళ డబుల్ బొనాంజా ట్రీట్.. కొత్త పోస్టర్ రిలీజ్!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పవన్, సాయిధరమ్ తేజ్‌ల ఫస్ట్ లుక్‌లు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సాయి ధరమ్ కి జోడిగా కేతిక శర్మ నటించబోతుందని తెలుస్తోండగా, మరో అందాల భామా ప్రియా వారియర్ చెల్లి పాత్రలో కనిపించనుందని సమాచారం. బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రోహిణి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Dubbing works for #BroTheAvatar commences with a Pooja Ceremony today 🥳
Worldwide Release on July 28th 💥@PawanKalyan @IamSaiDharamTej@thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @lemonsprasad @bkrsatish @neeta_lulla @ZeeStudios_ @zeestudiossouth… pic.twitter.com/UYCalAhaCT
— People Media Factory (@peoplemediafcy) May 30, 2023
ఇదిలా ఉంటే.. పవన్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ హరి హర వీరమల్లు షూటింగ్ ఎట్టకేలకు తిరిగి ప్రారంభం కానుంది. వచ్చేవారం నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో కీలక షెడ్యూల్ జరగనుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాని ఏ ఎమ్ రత్నం నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.