PKSDT : వినోదయ సిత్తం షూటింగ్ పూర్తి చేసిన పవన్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవలే వినోదయ సిత్తం రీమేక్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీలోని తన టాకీ పోర్షన్ పూర్తి చేసేసాడట.

Pawan Kalyan completed his talkie portion in PKSDT
PKSDT : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా షూటింగ్ ల విషయంలో వేగం పెంచేశాడు. ప్రస్తుతం పవన్ 4 సినిమాలకు సైన్ చేసి ఉన్నాడు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డాడు. హరి హర వీరమల్లు షూటింగ్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి, పవన్ ఇటీవలే వినోదయ సిత్తం రీమేక్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఈ మూవీలో మెయిన్ లీడ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పాత్ర కేవలం సినిమాలో సగ భాగం మాత్రమే ఉంటుంది.
Pawan Kalyan – Sai Dharam Tej : కలెక్షన్స్ సునామీ సృష్టించడానికి డేట్ ఫిక్స్ చేసిన మామ అల్లుడు..
దీంతో పవన్ టాకీ పోర్షన్ షూటింగ్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 22న షూటింగ్ మొదలు పెట్టుకున్న చిత్ర యూనిట్ శరవేగంగా పవన్ పాత్రకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు సముద్రఖని.. ‘థాంక్యూ గాడ్, పవన్ కళ్యాణ్ సార్ కి సంబంధించిన షూటింగ్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసాము’ అంటూ ఒక సెట్ లోని పవన్ ఫోటో షేర్ చేశాడు. ఇటీవల ఈ సినిమా సెట్ నుంచి పవన్ అండ్ సాయి ధరమ్ లుక్స్ లీక్ అయిన విషయం తెలిసిందే.
Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ మొదలయ్యేది అప్పుడే.. డేట్ ఫిక్స్ చేసిన పవన్?
ఇప్పుడు సముద్రఖని షేర్ చేసిన ఫొటోలో కూడా సేమ్ లుక్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ అండ్ బ్యాలన్స్ షూట్ కూడా త్వరగా పూర్తి చేయనున్నారు. ఈ సినిమాని జులై 28న రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించేశారు. కాగా ఈ సినిమాలో నటించే ఇతర యాక్టర్స్ గురించి వివరాలు తెలియాల్సి ఉంది. తమిళంలో ఫామిలీ డ్రామాగా తెరకెక్కిన వినోదయ సిత్తం.. తెలుగులో కూడా అదే జోనర్ లో తెరకెక్కిస్తున్నారా? లేదా? కథలో ఏమన్నా చేంజ్స్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది.
Thank you God 🧿. We have successfully completed our talkie portion of Kalyan sir.
See you all in theatres on July 28 🙏🏻..VELVOM…💪💪💪💪💪💪💪❤️❤️❤️❤️
pic.twitter.com/BiAzIzPn36— P.samuthirakani (@thondankani) March 25, 2023