Pawan Kalyan: సిరివెన్నెల సీతారామశాస్త్రిని తలుచుకుని పవన్ ఎమోషనల్ ట్వీట్
ప్రముఖ లెజెండరీ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా ‘సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటిని....

Pawan Kalyan: ప్రముఖ లెజెండరీ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా ‘సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటిని ఇటీవల భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సీతారామశాస్త్రిని గుర్తుకు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. సీతారామశాస్త్రి గారి అక్షరాలు నిత్య చైతన్య కిరణాలు అంటూ పవన్ కళ్యాణ్ సిరివెన్నెలను గుర్తుకు చేసుకున్నాడు.
ఈ సందర్భంగా పవన్ చాలా ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘‘కవి తన రచనల ద్వారా అమరత్వం పొందుతాడు. భౌతికంగా లేకపోయినా తను సమాజానికి అందించిన అక్షర కిరణాల ద్వారా స్ఫూర్తినిస్తాడు. పంచ భూతాలలో కలసిపోయినా రాబోయే తరానికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటారు. అలాంటి ఒక గొప్ప కవి ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి గారు. ఆయన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నమస్సుమాంజలి. సీతారామ శాస్త్రి గారి జయంతి సందర్భంగా విడుదలైన ‘సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటి చూశాక – ఆ అక్షర తపస్విని మొదటిసారి ‘రుద్రవీణ’ సినిమా సమయంలో కలసిన సందర్భం గుర్తుకు వచ్చింది.
Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!
అన్నయ్య చిరంజీవి నటించిన ఈ సినిమాకు నాగబాబు అన్నయ్య నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రానికి నేను సహ నిర్మాతగా ఉంటూ నిర్మాణంలో పాలుపంచుకొన్నాను. ఆ సందర్భంలో శాస్త్రి గారిని తరచూ కలిసేవాడిని. ఆ చిత్రంలో ‘చుట్టూపక్కల చూడరా చిన్నవాడా’ పాటలో చివరి చరణం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వుతినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది. గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది. ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా. తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే – అనే ఈ పంక్తులు ఇప్పటికీ నా బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటాయి. నన్ను నిలబెట్టిన ఈ సమాజానికి రుణం తీర్చుకోవడం నా విధిగా భావిస్తాను.
జనసేన పార్టీ పక్షాన కౌలు రైతులకు భరోసా ఇచ్చి ఆర్థిక సాయం చేయడం కూడా నా బాధ్యతే. మనకున్నది పదిమందికీ పంచాలి – అది ప్రకృతి ధర్మం అనే విషయాన్నీ రుద్రవీణలోని ‘తరలిరాద తనే వసంతం..’ అనే పాటలో వినిపించారు. ‘పంచే గుణమే పోతే – ప్రపంచమే శూన్యం. ఇది తెలియని మనుగడ కథ – దిశనెరుగని గమనము కద’ అనే పంక్తులలోని భావాన్ని అందరం తెలుసుకోవాలి. ఏరు దాటాకా అవసరం తీరిందని తెప్ప తగలబెట్టే ఆలోచనలతో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు ఒకసారి శ్రీ శాస్త్రి గారి సాహిత్యాన్ని చదివి అర్థం చేసుకోవాలి. సీతారామ శాస్త్రి గారు రచనలన్నిటిలో కవిగా ఆయనలోని సామాజిక బాధ్యత కనిపిస్తుంది. సమాజానికీ బాధ్యతలు గుర్తు చేసే దృక్పథం అందులో నిక్షిప్తమై ఉంటుంది.
Pawan Kalyan : సముద్రఖని దర్శకత్వంలో పవన్ సినిమా.. మరో రీమేక్..
ఆయన అక్షరాలు నిత్య చైతన్య కిరణాలు. శాస్త్రి గారి రచనలలోని గాఢతను చెబుతూ కవిగా ఆయన్ని మరింత అర్థం చేసుకొనేలా చేశారు త్రివిక్రమ్ గారు. ఆయనకు నా కృతజ్ఞతలు. ‘సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం’ అందిస్తున్న ‘తానా’ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు.’’ అంటూ పవన్ సీతారామశాస్త్రి గారి జయంతి సందర్భంగా గుర్తుకు చేసుకున్నారు. ప్రస్తుతం పవన్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కవి తన రచనల ద్వారా అమరత్వం పొందుతాడు, లేక పోయినా స్ఫూర్తి ఇస్తాడు. పంచ భూతాలలో కలసి పొయినా రాబోయే తరానికి దిశా నిర్దేశం చేస్తూనే వుంటారు. అలాంటి ఒక గొప్ప కవి ‘సిరివెన్నెల’ గారికి, ఆయన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నమస్సుమాంజలి…🙏 pic.twitter.com/WdxiCSjIDh
— Pawan Kalyan (@PawanKalyan) May 23, 2022
” నువ్వుతినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది
ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా
తెప్ప తగల బెట్టేస్తావా ఏరు దాటగానే”‘రుద్రవీణ’ చిత్రంలోని ‘చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా’ పాటలోని ఈ పంక్తులు నన్నెoతో ప్రభావితం చేశాయి.
— Pawan Kalyan (@PawanKalyan) May 23, 2022
కవి తన రచనల ద్వారా అమరత్వం పొందుతాడు, లేక పోయినా స్ఫూర్తి ఇస్తాడు. పంచ భూతాలలో కలసి పొయినా రాబోయే తరానికి దిశా నిర్దేశం చేస్తూనే వుంటారు. అలాంటి ఒక గొప్ప కవి ‘సిరివెన్నెల’ గారికి, ఆయన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నమస్సుమాంజలి…🙏 https://t.co/MF1HIGTfLT
— Pawan Kalyan (@PawanKalyan) May 23, 2022
- Ali: పవన్‌తో మళ్లీ కనిపిస్తానంటోన్న ఆలీ!
- Sagar K Chandra : ఎట్టకేలకు భీమ్లానాయక్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా.. ఛాన్స్ ఇచ్చిన నితిన్..
- Perni Nani : మోదీని పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు : మాజీ మంత్రి పేర్ని నాని
- Major : పవన్ తనయుడిలో ఈ ట్యాలెంట్ చూస్తే ఆశ్చర్యపోతారు.. మేజర్ సాంగ్ కంపోజ్ చేసిన అకిరా..
- Pawan Kalyan : మూడు నెలల్లో హరిహరవీరమల్లు అయిపోతుందా??
1Director Maruthi : అలా చేస్తే పక్క భాషల నటుల్ని తెచ్చుకోవాల్సిన పని లేదు..
2Sonia Gandhi: సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీపై రేప్ కేస్
3Food Poison : చికెన్ గ్రేవీతో వంకాయ కర్రీ.. సిద్దిపేట గురుకుల పాఠశాలలో 120మందికి ఫుడ్ పాయిజన్
4Vandemataram: బంకించంద్ర ఛటర్జీ బర్త్ డే స్పెషల్
5Khairatabad Ganesh Idol Poster : మొదటిసారి మట్టితో ఖైరతాబాద్ వినాయకుడు.. నమూనా ఇదిగో.. ఎత్తు ఎంతో తెలుసా
6Covid-19 : హైదరాబాద్ లో పెరుగుతున్న కోవిడ్ కేసులు
7Amala Paul: అందాల అమలా.. ఇంత కైపుగా చూస్తే ఎలా?
8Viral Video : కొబ్బరి కాయ ఎంత పనిచేసింది.. బైక్‌పై వెళ్లే మహిళ తలపై పడింది.. అంతే.. షాకింగ్ వీడియో!
9Presidential Polls: యశ్వంత్ సిన్హా ఫోన్ చేశారు.. ఆయనకే ఓటు వేస్తాం: అసదుద్దీన్
10Agent: ఏజెంట్ ట్విస్టుకు ఫ్యూజులు ఎగరాల్సిందేనా..?
-
Kolkata Student : జేయూ విద్యార్థికి 3 జాబ్ ఆఫర్లు.. గూగుల్, అమెజాన్ వద్దన్నాడు.. ఫేస్బుక్లో భారీ ప్యాకేజీ కొట్టేశాడు!
-
Maa Neella Tank: ఆకట్టుకుంటున్న మా నీళ్ల ట్యాంక్ టీజర్.. ఇది ఒరిజినల్!
-
OnePlus 10T 5G : వన్‌ప్లస్ 10T 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Nagarjuna: ‘సర్దార్’ను పట్టేసుకున్న నాగార్జున!
-
Microsoft Alert : మైక్రోసాఫ్ట్ అలర్ట్.. Windows 8.1కి సపోర్టు ఆపేస్తోంది.. వెంటనే Upgrade చేసుకోండి!
-
Mega154: మెగాస్టార్‌కు విలన్ దొరికాడా..?
-
Swathimuthyam: నీ చారెడు కళ్లే.. అంటూ పాటందుకున్న స్వాతిముత్యం!
-
Zee Telugu: జీ తెలుగు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో ఆడిషన్స్.. ఎక్కడ.. ఎప్పుడంటే?