Updated On - 12:51 pm, Tue, 21 July 20
By
sekharవివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘పవర్‌స్టార్’ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. వర్మ నేరుగా చెప్పకపోయినా ఆర్జీవీ మెగా ఫ్యామిలీని, పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసినట్లు అర్థమవుతుంది.
వర్మ వేస్తున్న వెర్రి వేషాలు చూస్తూ కొన్నిరోజులు పవన్ ఫ్యాన్స్ కామ్‌గా ఉన్నారు. అయితే వర్మ పబ్లిసిటీ పీక్స్‌కు చేరే కొద్దీ.. వర్మను ఇలా వదిలేస్తే లాభం లేదనుకున్నారేమో ఆయన బాటలోనే ఆయనపై సినిమాలను తెరకెక్కించడం స్టార్ట్ చేశారు. ఇప్పటికే నూతన్ నాయుడు దర్శకత్వంలో ‘పరాన్నజీవి’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 25న ఈ సినిమా ఓటీటీ ద్వారా విడుదల కానుంది.
ఇప్పుడు వర్మను టార్గెట్ చేసిన పవన్ ఫ్యాన్స్ ఏకంగా ‘డేరాబాబా’ (దీరా బాబా) అనే వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. దీనికి వీరు.కె.రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఇందులో ఆర్జీవీ పాత్రలో షకలక శంకర్ నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు పవన్ ఫ్యాన్స్. ట్రైలర్‌లో వర్మ మార్క్ తలతిక్క సమాధానాలతో, హావభావాలతో ఆకట్టుకున్నాడు శంకర్..
Pawan Kalyan : నా ఆరోగ్యం కుదుట పడుతోంది.. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండండి : పవన్ కళ్యాణ్
జనసేనాని కోసం అభిమానుల పూజలు
Nagababu : అల్లుడికి పండుగ గిఫ్టు ఇచ్చిన నాగబాబు
Tollywood : లేటెస్ట్ 30 ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్..
Vakeel Saab : ‘వకీల్ సాబ్’ ఘనవిజయం మా బాధ్యత మరింత పెంచింది – నిర్మాత దిల్ రాజు..
Jana sena Glass symbol: జనసేనకి ఊహించని ఎదరుదెబ్బ.. సింబల్ పోయింది