Pawan Kalyan : సినీ ప‌రిశ్ర‌మ‌కు ఇబ్బందులు క‌లిగిస్తే తాట తీస్తా – పవన్ కళ్యాణ్ ఘాటు హెచ్చరిక

చిత్ర పరిశ్రమ చిన్నది కాదని, దాని జోలికి ఎవరైనా వస్తే తాట తీస్తామన్నారు పవన్ కళ్యాణ్. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

10TV Telugu News

Pawan Kalyan : సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో హాట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ విచ్చేశారు. ఈ సందర్బంగా పవన్, సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. తేజ్ ఇంకా కళ్ళు తెరవలేదని, ప్రస్తుతం బెడ్ పైనే ఉన్నానని తెలిపారు. తేజ్ ఆసుపత్రిలో ఉండటంతో తానూ ఈ ఈవెంట్ కి వచ్చినట్లు వివరించారు.

ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ అనేక అంశాలపై మాట్లాడారు. సినిమా టికెట్లు, తేజ్ రోడ్డు ప్రమాదం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై మాట్లాడుతూ అధికార వైసీపీపై విమర్శలు గుప్పించారు. సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు రోడ్డు ప్ర‌మాదం బాధాక‌రం అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను ఇంత వ‌ర‌కు తేజ్ సినిమా ఫంక్ష‌న్ల‌కు రాలేద‌ని చెప్పారు. తేజ్‌ రోడ్డు ప్ర‌మాదంపై మీడియాలో లేనిపోని క‌థ‌నాలు ప్ర‌చారం చేశార‌న్నారు. సాయి తేజ్ ప్ర‌మాదంపై కొంద‌రు వివాదాస్ప‌దంగా మాట్లాడార‌ని పేర్కొన్నారు. తేజ్ ప్ర‌మాదం కంటే మాట్లాడ‌వ‌ల్సిన‌వి చాలా ఉన్నాయ‌న్నారు. తేజ్‌కు మీ అంద‌రి ఆశీస్సులు కావాల‌ని, అత‌డు మీ అంద‌రి ఆనందాన్ని కోరుకుంటున్నార‌ని చెప్పారు.

Read More : Hyderabad : నగరంలో కుండపోత..ట్రాఫిక్ అస్తవ్యస్తం, స్తంభించిన జనజీవనం

ఇక ఇదే సమయంలో రాజకీయాలపై మాట్లాడారు.. రాను రాను రాకకీయాల్లో విలువలు లేకుండా పోతున్నాయని అన్నారు. సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం విషయంపై పెట్టినంత దృష్టి వివేకానంద రెడ్డి హత్యకేసుపై పెట్టి ఉంటే బాగుండేదని పవన్ అన్నారు. తేజ్ యాక్సిడెంట్ మీద కాదు మీరు మాట్లాడాల్సింది.. కోడి కత్తిమీద, ఆరేళ్ళ చిన్నారిపై జరిగిన అత్యాచారం మీద మాట్లాడాలన్నారు. సినిమా నటులపై విమర్శలు మాని కాపు రిజర్వేషన్, పులివెందుల గురించి రాసే దమ్ము మీకుందా అంటూ సవాల్ విసిరారు.

Read More : Pawan Kalyan : తేజ్ ఇంకా కళ్లు తెరవలేదు-పవన్ కళ్యాణ్

ఏపీలో సినిమా థియేట‌ర్లు ఎందుకు తెరుచుకోవ‌డం లేద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ నిల‌దీశారు. ప్ర‌భుత్వ ఖ‌జానాలో డ‌బ్బుల్లేనందు వ‌ల్లే సినిమా టికెట్లు ప్ర‌భుత్వ‌మే విక్ర‌యిస్తున్న‌ద‌ని వ్యాఖ్యానించారు. గిరిజ‌నుల‌కు పోడు భూములు ఎందుకు ద‌క్క‌డం లేదో అడ‌గండ‌న్నారు. ప‌వ‌న్ సినిమాల‌ను ఆపేస్తే భ‌య‌ప‌డిపోతార‌ని వైసీపీ వాళ్లు అనుకుంటున్నార‌న్నారు. గూండాల‌కు భ‌య‌ప‌డితే బ‌త‌క‌లేం అని పేర్కొన్నారు. ఏపీలో థియేటర్లు తెరుచుకోకపోవడం వలన 10 వేలమంది ఉపాధి కోల్పోయారని పవన్ అన్నారు. దీనిపై మోహన్ బాబు స్పందించాలని తెలిపారు. ఈ విషయంపై జగన్ తో చర్చించాలని పవన్ కోరారు.

అలాగే రెమ్యూన‌రేష‌న్ వివాదంపై ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఘాటుగా మాట్లాడారు. తాను అడ్డ‌గోలుగా సంపాదించ‌డంలేదు.. వేల కోట్లు సంపాదించ‌డం లేదు. డ్యాన్స్‌లు, ఫైట్లు.. కిందా మీదా ప‌డి సంపాదిస్తున్నా.. సంప‌ద సృష్టించ‌క‌పోతే డ‌బ్బులెలా వ‌స్తాయి అని వ్యాఖ్యానించారు.

Read More : Andhra Pradesh : పూర్తైన జెడ్పీ వైస్‌ ఛైర్మన్ల ఎంపిక.. ఒక్కో జిల్లాకు ఇద్దరు

వైసీపీ నాయకులు సినీ ఇండస్ట్రీ వైపు చూడొద్దని అది వైసీపీ రిపబ్లిక్ కాదని.. ఇలా చేస్తే ఫ్యూచర్ లో గట్టి షాక్ తింటారని హెచ్చరించారు. ఇక తన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడుతూ తనకు రాజకీయాల్లోకి రావడం అసలు ఇష్టం లేదని కానీ కర్మ ఆలా రాజకీయాలవైపు మళ్లించిందని తెలిపారు. ఇక ఇదే సమయంలో మోహన్ బాబుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్, విద్యనికేతన్ లో కూడా అన్ లైన్ ఫీజులు పెట్టాలన్నారు.