Vakeelsaab: ప్రేక్షకుల గుండెల్లో మించిన ఉన్నత స్థానం ఏదీ లేదంటోన్న పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌లో జరిగిన శిల్పకళావేదికలో జరిగిన వకీల్ సాబ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్..

Vakeelsaab: ప్రేక్షకుల గుండెల్లో మించిన ఉన్నత స్థానం ఏదీ లేదంటోన్న పవన్ కళ్యాణ్

Vakeelsaab

Vakeelsaab: హైదరాబాద్‌లో జరిగిన శిల్పకళావేదికలో జరిగిన వకీల్ సాబ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి పవన్ వస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో అభిమానులు పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తించారు. ఫ్యాన్స్ ను సంతోషసాగరంలో ముంచెత్తుతూ పవన్ కల్యాణ్ తన మిత్రుడు, ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయితో కలిసి ఈవెంట్‌కు వచ్చారు.

* సినిమా ఫంక్షన్ కు వచ్చి చాలా సంవత్సరాలు అయింది.
* బండ్ల గణేశ్ లా మాట్లాడటం రాదు.
* మూడేళ్లు సినిమా చేయలేదనే ఆలోచన రాలేదు. మీరెప్పుడూ నా గుండెల్లోనే ఉన్నారు.
* సినీ పరిశ్రమకు వచ్చి 24 సంవత్సరాలు అయిందని తెలీదు. పని చేసుకుంటూ పోయాను.
* దిల్ రాజు లాంటి వ్యక్తితోటి సినిమా చేయడం సంతోషంగా భావిస్తాను.
* కల కనే వాళ్లని చూసి ఇష్టపడతాను. దిల్ రాజు లాంటి నిర్మాతతో ముందుగా చేసి ఉంటే బాగుండేది.
* చిన్న స్థాయి నుంచి వచ్చే వ్యక్తులంటే ఇష్టపడతాను.
* డైరక్టర్ వేణు శ్రీరాం ఇక్కడకు రాగలడం.. అలాంటి చక్కటి దర్శకుడితో పని చేసినందుకు అదృష్టంగా భావిస్తున్నాను.
* ప్రేక్షకుల గుండెల్లో మించిన ఉన్నత స్థానం నాకు ఏదీ లేదు.
* కర్మ యోగం చేయడానికి సిద్ధంగాపడ్డాను. మీ అందరి అభిమానం సంపాదించగలిగాను. భగవంతుడు నాకు ఆ అవకాశం కల్పించాడు.
* భువనగిరి చంద్రశేఖర్ అనే లాయర్.. మానవహక్కుల లాయర్ ఆయన.. క్యాన్సర్ తో బాధపడుతూ ఇంజెక్షన్లు తీసుకుంటూ వాదించేవారు.
* ఈ పాత్ర చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నా.
* ఐటెం సాంగ్ లు చేయడానికి ఇష్టపడను. అక్క, వదిన, అమ్మ, చెల్లెల్లితో పెరిగిన వాడిని. కుటుంబమంతా కలిసి చూసేలా సినిమా తీయాలనుకుంటాను.
* అక్క, చెల్లి లాంటి ఆడపడుచులు కాపాడుకోగలిగినప్పుడే జై భారత్ అనగలం.
* ముగ్గురు అమ్మాయిలకు అన్యాయం జరిగినప్పుడు వారికి న్యాయం చేసేందుకు వాదించే పాత్రలో లాయర్ గా నటించడం సంతోషంగా ఉంది.
* చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా కాబట్టి ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమా చేశా.
* ప్రకాశ్ రాజ్ గారు లాంటి బలమైన నటుడు ఉండటం వల్ల పర్ ఫార్మెన్స్ మెరుగవుతుంది.
* సినిమాపరంగా ప్రకాశ్ రాజ్ నాకు చాలా ఇష్టం.
* సాంప్రదాయ సంగీతంలో మగువా మగువా పాటను వినిపించిన బృందానికి థ్యాంక్స్.
* శివమణి గారు సాక్ష్యాత్తు శివ స్వరూపుడు.
* మీరు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని ప్రత్యేకంగా అనుకోను. మీరు తక్కువ అవకుండా మాత్రం చూసుకుంటాను.

అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులతో మాట్లాడారు.